Menu Close

Mana Bharathamlo Lyrics in Telugu – Jagadeka Veerudu Athiloka Sundari

Mana Bharathamlo Lyrics in Telugu – Jagadeka Veerudu Athiloka Sundari

పల్లవి:
హే హే రపరపపర రపరపపర పా
హే హే రపరపపర రపరపపర పా
రపరపా రపరపా రప్పప్పా
రపరపా రపరపా రప్పప్పా

మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలురా
ఈ కొండవీటికి రాజసింహుడొక్కడే రారాజురా
మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలురా
ఈ కొండవీటికి రాజసింహుడొక్కడే రారాజురా
ఆ రాజు గాథే ఈ రాజు పాట నా పేరే రాజు
ఎన్ పేర్దా రాజు మేరా నాం రాజు మై నేం ఈజ్ రాజూ
మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలురా
ఈ కొండవీటికి రాజసింహుడొక్కడే రారాజురా
చరణం 1:
భాయియో ఔర్ బెహ్నో
ఈ కొండ వీడు వైభవాన్నీ చూసి కన్ను కుట్టిన శత్రు రాజు ధూమ కేతు
తన సైన్యంతో దండెత్తి వచ్చాడు హా
అప్పుడు మన రాజసింహుడు తెలివిగా
ఈ సొరంగ మార్గం గుండా తన సేనలతో
శత్రుసైన్యం మీదికి మెరుపు దాడి చేశాడు

విజయుడై వచ్చినాడురా తన ప్రజలంతా మెచ్చినారురా
దుర్గమునే ఏలినాడురా ఆ స్వర్గమునే దించినాడురా
అక్షితలే చల్లినారు రమణులంతా
అహ హారతులే భక్తిమీర పట్టినారురా
సింహాసమెక్కి తాను విష్ణుమూర్తిలా
అహ సిరులెన్నో చెలువు మీద చెలికినాడురా

ఏ రాజు ఎవరైనా మా రాజువింక నువ్వంటా
నీ మనసే మా కోట మీ మాట మాకు పూబాటా
రాజాది రాజా మార్తాండ తేజ
నా పేరే రాజు మై నేం ఈజ్ రాజూ

మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలురా
ఈ కొండవీటికి రాజసింహుడొక్కడే రారాజురా
ఆ రాజు గాథే ఈ రాజు పాట నా పేరే రాజు
ఎన్ పేర్దా రాజు
మేరా నాం రాజు
మై నేం ఈజ్ రాజూ
చరణం 2:
అందాల ఆ రాజుకి ముద్దుల భార్యలు ఇద్దరు
పెద్ద రాణి నాట్యంలో మయూరి
తాం తకిట తదీం తకిట తరకిటతాం తరకిటతాం తరకిటతాం
తాం తకిట తదీం తకిట తరకిటతాం తరకిటతాం తరకిటతాం
చిన్న రాణి సంగీతంలో దిట్ట సరిగమల పుట్ట
పద పద సాస సరి గరి సాపద
పద పద సాస సగరిగ సరి గస పద
దరి రిగ గస సప గరిస దప గారిస

కళలే పోషించినాడురా తను కావ్యాలే రాసినాడురా
శిలలే తెప్పించినాడురా ఘన శిల్పాలే మలచినాడురా
చెరువులెన్నో తవ్వించి కరువుమాపి
అహ అన్నపూర్ణ కోవెలగా చేసినాడురా
కులమతాల రక్కసిని రూపుమాపి
అహ రామ రాజ్యమన్న పేరు తెచ్చినాడురా
నీలాంటి రాజుంటే ఆ దేవుడింక ఎందుకంట
చల్లనైన నీ చూపే మాకున్న పండు ఎన్నెలంట
రాజాధి రాజా మార్తాండ తేజా
నా పేరే రాజు మేరా నాం రాజు

మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలురా
ఈ కొండవీటికి రాజసింహుడొక్కడే రారాజురా
ఆ రాజు గాథే ఈ రాజు పాట మమ నామ రాజు
ఎన్ పేర్దా రాజు
ఎండ వేరే రాజు
నన్న హెసరే రాజు
నా పేరే రాజు

Mana Bharathamlo Lyrics in Telugu – Jagadeka Veerudu Athiloka Sundari

Like and Share
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading