Menu Close

Malli Malli Idi Rani Roju Lyrics In Telugu – Rakshasudu

Malli Malli Idi Rani Roju Lyrics In Telugu – Rakshasudu

మళ్ళి మళ్ళి ఇది రాని రోజు… మల్లిజాజి అల్లుకున్న రోజు
జాబిలంటి ఈ చిన్నదాన్ని… చూడకుంటే నాకు వెన్నెలేది

ఏదో అడగాలని… ఎంతో చెప్పాలని
రగిలే ఆరాటంలో…
వెళ్ళలేను ఉండలేను… ఏమి కాను..!!

మళ్ళి మళ్ళి ఇది రాని రోజు…
మల్లిజాజి అల్లుకున్న రోజు…

Bigg Boss 10 గెలిచేది ఎవరో చెప్పగలరా?

చేరువైన రాయబారాలే… చెప్పబోతే మాట మౌనం
దూరమైన ప్రేమ ధ్యానాలే… పాడలేని భావ గీతం
ఎండల్లో వెన్నెల్లో ఏంచేతో…
ఒక్కరం ఇద్దరం అవుతున్నాం…
వసంతాలు ఎన్నొస్తున్నా… కోకిలమ్మ కబురేది
గున్నమావి విరబూస్తున్న… తోటమాలి జాడేది
నా ఎదే తుమ్మెదై… సన్నిదే చేరగా

మళ్ళి మళ్ళి ఇది రాని రోజు…
మల్లిజాజి అల్లుకున్న రోజు…

కళ్ళనిండా నీలి స్వప్నాలే… మోయలేని వింత మోహం
దేహమున్న లేవు ప్రాణాలే… నీవు కాదా నాకు ప్రాణం
సందిట్లో ఈ మొగ్గే పూయనీ… రాగాలే బుగ్గల్లో దాయని

గులాబీలు పూయిస్తున్నా… తేనెటీగ అతిదేది
సందెమబ్బులెన్నొస్తున్నా… స్వాతి చినుకు తడుపేది
రేవులో నావలా… నీ జతే కోరగ

జాబిలంటి ఈ చిన్నదాన్ని… చూడకుంటే నీకు వెన్నెలేది
ఏదో అడగాలని… ఎంతో చెప్పాలని
రగిలే ఆరాటంలో…
వెళ్ళలేను ఉండలేను… ఏమి కాను

హా… మళ్ళి మళ్ళి ఇది రాని రోజు
మల్లిజాజి అల్లుకున్న రోజు…

Like and Share
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
Share with your friends & family
Posted in Lyrics in Telugu - Movie Songs