Menu Close

Malle Theegaku Pandirivole Song Lyrics In Telugu – Orey Rikshaw

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

ఆ ఆఆ ఆఆ…
మల్లెతీగకు పందిరివోలె… మస్క సీకటిలో వెన్నెలవోలె
నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా…
తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా
నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా…
తోబుట్టు రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా…

ముళ్ల తీగమ్మా… కంచె మీద చీర వేస్తే రానే రాధమ్మా
ఆడపిల్లమ్మా… రెప్ప రెప్పా విప్పుకుంటూ చూస్తే తప్పమ్మా

పెద్దమనిషివై పూసిన నుండే… ఆడపిల్లపై ఆంక్షలు ఎన్నో
చూసే దానిని చూడొద్దంటరు… నవ్వేచోట నవ్వొద్దంటరు…
పెద్దమనిషివై పూసిన నుండే… ఆడపిల్లపై ఆంక్షలు ఎన్నో
చూసే దానిని చూడొద్దంటరు… నవ్వేచోట నవ్వొద్దంటరు…

అటువంటి నే అన్నను గాను చెల్లెమ్మా…
నీ చిన్ననాటి స్నేహితునమ్మా చెల్లెమ్మా…
అడవిలోన నెమలివోలె చెల్లెమ్మా…
ఆటలాడుకో పాటపాడుకో చెల్లెమ్మా…

మల్లెతీగకు పందిరివోలె…
మస్క సీకటిలో వెన్నెలవోలె చెల్లెమ్మా…

ఆడపిల్లంటే అగ్గిపుల్లమ్మా ఓయమ్మా…
ఎవడికంట పడ్డ మండిపోవునమ్మా… ఆహు ఆహు
ఆడపిల్లంటే ఇంటికి భారము ఓయమ్మా…
కన్నవాళ్లకే రోకటి పోటమ్మా… ఆహు ఆహు

సిన్నబోయి నువు కూసున్నవంటే… ఎన్నుపూస నాదిరిగేనమ్మా
ఒక్కక్షణము నువు కనబడకుంటే… నా కనుపాపలు కమిలిపోతయి…
సిన్నబోయి నువు కూసున్నవంటే… ఎన్నుపూస నాదిరిగేనమ్మా
ఒక్కక్షణము నువు కనబడకుంటే… నా కనుపాపలు కమిలిపోతయి

ఒక్క గడియ నువు మాటాడకుంటే చెల్లెమ్మా…
నే దిక్కులేని పక్షినైతానమ్మా చెల్లెమ్మా…
బువ్వ తినక నువు అలిగినవంటే చెల్లెమ్మా…
నా భుజం ఇరిగినంత పనైతదమ్మా చెల్లెమ్మా…

మల్లెతీగకు పందిరివోలె…
మస్క సీకటిలో వెన్నెలవోలె చెల్లెమ్మా…

ఇల్లు వాకిలి వదిలి పెట్టి… ఆడపిల్ల పనికి వెళ్లి
భుజం నొప్పి సదువు సదివేదెందుకు…?
ఆ కట్న కానుకలు ఇచ్చి సచ్చేటందుకు…
ఆ కట్న కానుకలు ఇచ్చి సచ్చేటందుకు…

చదివినంత నిన్ను చదివిస్తనమ్మా…
ఎదిగినంత నిన్ను ఎదిగిస్తనమ్మా…
నీకు పెళ్ళీడు వచ్చేనాటికి… పువ్వో పత్తో కూడబెట్టుతా

చదివినంత నిన్ను చదివిస్తనమ్మా…
ఎదిగినంత నిన్ను ఎదిగిస్తనమ్మా…
నీకు పెళ్ళీడు వచ్చేనాటికి… పువ్వో పత్తో కూడబెట్టుతా

నచ్చినోనికే ఇస్తానమ్మా చెల్లెమ్మా…
నా కన్నీళ్ళతో కాళ్లు కడుగుతా చెల్లెమ్మా…
రిక్షా బండినే మేనా గడతా చెల్లెమ్మా…
మీ అత్తోరింటికి సాగనంపుతా చెల్లెమ్మా…

మల్లెతీగకు పందిరివోలె… మస్క సీకటిలో వెన్నెలవోలె
నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా…
తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా
నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా…
తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా
తోబుట్టు రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా…
తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా…

Like and Share
+1
0
+1
1
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading