Menu Close

Maha Mahimatho Nindina Lyrics In Telugu – Telugu Christian Songs

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Maha Mahimatho Nindina Lyrics In Telugu – Telugu Christian Songs

Telugu Christian Songs Jesus

Maha Mahimatho Nindina Lyrics In Telugu – Telugu Christian Songs

మహా మహిమతో నిండిన… కృపాసత్య సంపూర్ణుడా
మహా మహిమతో నిండిన… కృపాసత్య సంపూర్ణుడా
ఇశ్రాయేలు స్తోత్రములపై… ఆసీనుడా యేసయ్యా
నా స్తుతుల సింహాసనం… నీకోసమే యేసయ్యా
మహా మహిమతో నిండిన… కృపాసత్య సంపూర్ణుడా

మహిమను విడిచి… భువిపైకి దిగివచ్చి
కరుణతో నను పిలిచి…
సత్యమును బోధించి… చీకటిని తొలగించి
వెలుగుతో నింపితివి…
సదయుడవై నా పాదములు… తొట్రిల్లనివ్వక
స్థిరపరచి నీ కృపాలో… నడిపించువాడవు

మహా మహిమతో నిండిన… కృపాసత్య సంపూర్ణుడా
ఇశ్రాయేలు స్తోత్రములపై… ఆసీనుడా యేసయ్యా

కరములుచాచి జలరాసులలో నుండి… నను లేవనెత్తితివి
క్షేమమును దయచేసి… నను వెంబడించి
అనుదినము కాచితివి…
అక్షయుడా ప్రేమను చూపి… ఆదరించినావు
నిర్మాలుడా భాహువు చాపి… దీవించువాడవు

మహా మహిమతో నిండిన… కృపాసత్య సంపూర్ణుడా
ఇశ్రాయేలు స్తోత్రములపై… ఆసీనుడా యేసయ్యా

పదివేలలోన గుర్తించదగిన… సుందరుడవు నీవు
అపరంజి పాదములు… అగ్ని నేత్రములు
కలిగిన వాడవు…
ఉన్నతుడా, మహోన్నతుడా… ఆరాధించెదను
రక్షకుడా, ప్రభాకరుడా… నిను ఆరాధించెదను

మహా మహిమతో నిండిన… కృపాసత్య సంపూర్ణుడా
ఇశ్రాయేలు స్తోత్రములపై… ఆసీనుడా యేసయ్యా
నా స్తుతుల సింహాసనం… నీకోసమే యేసయ్యా
మహా మహిమతో నిండిన… కృపాసత్య సంపూర్ణుడా

Maha Mahimatho Nindina Lyrics In Telugu – Telugu Christian Songs

Like and Share
+1
3
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading