ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
మహా అద్భుతం కదా… అదే జీవితం కదా, ఆఆ
చినుకు చిగురు కలువ కొలను… అన్నీ నువ్వేలే
అలలు శిలలు కళలు తెరలు… ఏవైనా నువ్వేలే
ప్రశ్న బదులు హాయి దిగులు… అన్నీ నీలోనే
నువ్వు ఎలా చూపమని నిన్నే కోరితే
అలా ఆ క్షణమే చూపిస్తుంటుందే
ఇది గ్రహిస్తే మనసే… నువ్వు తెరిస్తే
ప్రతి రోజు రాదా వాసంతం
ఆనందాల చడి చప్పుడు… నీలో నాలో ఉంటాయెప్పుడు
గుర్తే పట్టక గుక్కెపెడితే… లాభం లేదే
నీకే ఉంటే చూసే కన్నులు.. చుట్టూ లేవా ఎన్నో రంగులు
రెప్పలు మూసి… చీకటి అంటే కుదరదే
ఓఓ.. కాలమే నేస్తమై నయం చేస్తుందే… గాయాల గతాన్ని
ఓహో..హో… ఓహో.. హో
అందుకే ఈ క్షణం ఓ నవ్వే నవ్వి
సంతోషాల తీరం పోదాం… భయం దేనికి
పడుతూ లేచే అలలే కాదా… నీకే ఆదర్శం
ఉరుమో మెరుపో ఎదురే పడనీ… పరుగాపకు నీ పయనం
తీపి కావాలంటే… చేదు మింగాలంతే
కష్టమొచ్చి కౌగిలిస్తే… హత్తుకో ఎంతో ఇష్టంగా
కళ్ళే తడవని విషాదాలని… కాళ్ళే తడపని సముద్రాలని
కలలోనైనా చూసేటందుకు వీలుంటుందా..!!!
చుట్టం చూపుగ వచ్చామందరం… మూటే కట్టుకు పోయేదెవ్వరం
ఉన్నన్నాళ్ళు ఉందాం ఒకరికి ఒకరుగా
కళ్ళే తడవని విషాదాలని… కాళ్ళే తడపని సముద్రాలని
కలలోనైనా చూసేటందుకు వీలుంటుందా..!!!
చుట్టం చూపుగ వచ్చామందరం… మూటే కట్టుకు పోయేదెవ్వరం
ఉన్నన్నాళ్ళు ఉందాం ఒకరికి ఒకరుగా
కళ్ళే తడవని విషాదాలని… కాళ్ళే తడపని సముద్రాలని
కలలోనైనా చూసేటందుకు వీలుంటుందా..!!!
చుట్టం చూపుగ వచ్చామందరం… మూటే కట్టుకు పోయేదెవ్వరం
ఉన్నన్నాళ్ళు ఉందాం ఒకరికి ఒకరుగా