అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
Madhura Madhuratara Lyrics in Telugu – Arjun
మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి
మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి
జాజి మల్లెల ఘుమఘుమల జావళీ
లేతసిగ్గుల సరిగమల జాబిలి
అమ్మా మీనాక్షీ, ఇది నీ మీనాక్షి
వరములు చిలక
స్వరములు చిలక
కరమున చిలక కలదానా
హిమగిరి చిలక
శివగిరి చిలక
మమతలు చిలక దిగిరావా
అఙ్గారం వాగైనది ఆ వాగే వైగైనది
ముడిపెట్టే ఏరైనది విడిపోతే నీరైనది
భరతనాట్య సంభరిత నర్తకి కూచిపూడిలో తకధిమిత
విశ్వనాథుని ఏకవీర ఆ తమిళ మహిళల వలపు గద
మనసే మథురై కొలువైన తల్లి మా మీనాక్షి
ఎదలో యమునై పొంగేటి ప్రేమకిది సాక్షి
అందాలే అష్టోత్తరం చదివించే సొగసున్నది
సొగసంతా నీరాజనం అర్పించే మనసున్నది
మధురనేలు మా తెలుగు నాయకుల మధుర సాహితీ రసికతలో
కట్టబొమ్మ తొడగొట్టి వేచిన తెలుగు వీర ఘన చరితలలో
తెలుగు తమిళం జతకట్టెనెన్నడో మీనాక్షి
మనసు మనసు వొకటైన జంటకిది సాక్షి