Madhu Priya Medaram Song Lyrics In Telugu – Medaram Adavilona
మేడారం అడవిలోన జాతరటో
కన్నెపెల్లి కాడ పచ్చాని అడవిలోన
సమ్మక్క సారలమ్మ పాటలురో
కట్టమీది తోవ జంపన్న వాగు కాడ
గిరిజాన గూడెములో ఎలుగులురో
కోయిలమ్మలార ఓ వాగువంకలార
వన్నె ప్రాణుల సిందులురో
ప్రేమగల్ల నేల బంగారు తల్లులేగా
యుద్ధానికే విద్య నేర్పిన నేల, ఆఆ ఆ ఆ
కాకతీయులే బెదిరెను యాల, ఆఆ ఆ ఆ
యుద్ధానికే విద్య నేర్పిన నేల
కాకతీయులే బెదిరెను యాల
మాఘశుద్ధ పౌర్ణమి ఇయ్యాల
రెండేళ్లకోసారి మీ పండుగా
అరెరెరె, మేడారం అడవిలోన జాతరటో
మేడిరాజు బంగారు దీపమయ్యో
సమ్మక్క సారలమ్మ రాతలురో
ఎదురుకోళ్ల కోలాటమాటలురో
మేడారం అడవిలోన జాతరటో
మేడిరాజు బంగారు దీపమయ్యో
సమ్మక్క సారలమ్మ రాతలురో
ఎదురుకోళ్ల కోలాటమాటలురో
ఆ సిలకాలగుట్ట మీద
కుంకుమ బొట్టువై, తారారారో
తల్లి పుట్ట మీద పుట్టినావ
కోయోల్ల కోసమే మా గుడిసెల్లో
తల్లి బంగారు నాగమ్మ
అడివమ్మ సోపతై, తారారారో
పెరిగినావమ్మ జీవరాశి కొమ్మలాగ
తోడువై ఆ అడవుల్లో
వేల చరిత్ర మనది
కోట్లాది ప్రజల ఈ కడలి
రాజునెదిరించే రణమై
ఇక దద్దరిల్లే ఈ ధరణి
గోలకొండ నుంచి పగిడిద్దరాజులంతా
వచ్చినారు నీ తెరువే
అరెరెరె, మేడారం అడవిలోన జాతరటో
మేడిరాజు బంగారు దీపమయ్యో
సమ్మక్క సారలమ్మ రాతలురో
ఎదురుకోళ్ల కోలాటమాటలురో
మేడారం అడవిలోన జాతరటో
మేడిరాజు బంగారు దీపమయ్యో
సమ్మక్క సారలమ్మ రాతలురో
ఎదురుకోళ్ల కోలాటమాటలురో
గర్భగుడై గద్దెలై మీ పూజ చేస్తరంట, తారారారో
మీకు బంగారు ముడుపులాగా
బెల్లాపు ఉండలంట మీ ముంగిట్లో
రెండేళ్ళనీ పండుగ దండిగా చేస్తారంట, తారారారో
రెండెడ్ల బండిలో నీ గుడి సేరీరంట ఆ రోజుల్లో
తెలంగాణ మన జాతి
నీ కొలువుతో వెలిగిన జ్యోతి
మన తెలంగాణ ఈ జాతి
నీ కొలువుతో వెలిగిన జ్యోతి
ఏటేటా మమ్ము దీవించు మీరే
సల్లంగ సూడాలే తల్లీ, ఈ ఈ
అరెరెరె, మేడారం అడవిలోన జాతరటో
మేడిరాజు బంగారు దీపమయ్యో
సమ్మక్క సారలమ్మ రాతలురో
ఎదురుకోళ్ల కోలాటమాటలురో
మేడారం అడవిలోన జాతరటో
మేడిరాజు బంగారు దీపమయ్యో
సమ్మక్క సారలమ్మ రాతలురో
ఎదురుకోళ్ల కోలాటమాటలురో
Madhu Priya Medaram Song Lyrics In Telugu – Medaram Adavilona
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.