మీరు కాఫీ తాగే ప్రతిసారీ ఈ కథను గుర్తుచేసుకోండి – Life Lessons in Telugu
ఒకరోజు, ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీకి చెందిన ఓ ప్రొఫెసర్, తన పాత మిత్రులను ఇంటికి ఆహ్వానించాడు. వారంతా జీవితంలో మంచి స్తాయికి ఎదిగినవారు. పెద్ద పెద్ద ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ వున్నారు. వాళ్లతో చిట్‌చాట్ చేస్తూన్నప్పుడు, జీవితం చాలా బిజీగా మారినట్టు, ఒత్తిడిని అధిగమించలేకపోతున్నట్టు వారు మాట్లాడుకుంటూ జీవితం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆ మాటల మద్యలో నుండి ప్రొఫెసర్ కిచెన్‌లోకి వెళ్లి, కాఫీని చేసి తీసుకువచ్చాడు. కానీ కాఫీని అందించే విధానం కొంచెం ప్రత్యేకంగా వుంది.
ఆ ప్రొఫెసర్ కాఫీని రకరకాల గ్లాసులులో నింపి టేబుల్‌పై పెట్టాడు. వాటిలో కొన్ని సిల్వర్, స్టీల్, ప్లాస్టిక్, ఇంకా ఒకటి రెండు క్రిస్టల్ గ్లాసులు కూడా ఉన్నాయి. అవన్నీ అక్కడ పెట్టి వాళ్ళ మిత్రులతో ప్రొఫెసర్ ఇలా అన్నాడు.
“ఈ టేబుల్ మీద కాఫీ ఉంది… మీకు నచ్చిన గ్లాస్‌ని తీసుకోండి.”
అందరూ ముందుకు వచ్చి, ఎవరికి నచ్చిన గ్లాస్ వాలు తీసుకుని తాగతున్నారు. చాలా మంది అందమైన గ్లాసులవైపే ఆకర్షితులయ్యారు. అసలు సాధారణ గ్లాసులు ఎవరూ ఎంచుకోలేదు. అంతా కాఫీ తాగుతుండగా, ప్రొఫెసర్ చిన్నగా నవ్వుతూ ఇలా అన్నాడు:
“మీరు అందరూ మంచి కాఫీ కోసం వచ్చినా, మీరు ఆకర్షితులైనది, ఎంచుకున్నది గ్లాస్ ని బట్టి. జీవితం కూడా అలానే. జీవితం అంటే కాఫీ. గ్లాస్ అనేది మన ఉద్యోగం, డబ్బు, ప్రాపర్టీ, హోదా. ఇవి మన జీవితానికి ఓ ప్యాకేజింగ్ మాత్రమే. కానీ మనం చాలా సార్లు గ్లాస్ మీద దృష్టి పెడతాం, అందమైన వాటికి ఆకర్షితులమవుతాం. కాఫీని అంటే అసలైన జీవితం దాని సారాన్ని ఆస్వాదించటం మర్చిపోతాం.”
సాదాసీదాగా జీవించండి. దానిలోనే ఆనందం ఉంది.
బయటి హోదాలు తాత్కాలికం. మీలోని ఆనందం శాశ్వతం.
ఇతరుల లైఫ్‌తో పోల్చుకోవద్దు. వారి గ్లాస్ మినహాయించి, అందరిదీ అదే కాఫీ.
ఇకపై, మీరు కాఫీ తాగే ప్రతిసారీ ఈ కథను గుర్తుచేసుకోండి.
లైఫ్ చేంజింగ్ స్టోరీ | Life Changing Stories in Telugu