ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
మంచి మొగుడు దొరకడం కష్టం
అందంగా వున్నాడు అనుకుంటే మెదడు ఖాళీగా ఉంటుంది.
డబున్నోడు అనుకుంటే అస్సలు రెస్పెక్ట్ ఇవ్వడు.
తెలివయిన వాడు అనుకుంటే…. సీరియస్ గా ఉంటాడు.
బాగా కష్టపడతాడు అంటే…. నిన్ను కూడా పట్టించుకోడు
నెమ్మదిగా వున్నాడు అనుకుంటే ……ఆయనో భగ్న ప్రేమికుడు.
బాధ్యతగా వున్నాడు అనుకుంటే……ఒక ముద్దూ …. ముచ్చట ఉండదు.
చదువువుకున్నాడు అనుకుంటే……. నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అంటాడు.
చదువు లేని వాడు అనుకుంటే….. నువ్వు ఎమన్నా ఎమన్నా అవమానిస్తున్నాడు అంటాడు.
స్మార్ట్ గా వున్నాడు అనుకుంటే అబద్దాల పుట్ట ………….ఎలా చచ్చేదిరా దేవుడా…..!!!!
మొగుడు పెళ్ళాం జోక్స్ – Wife and Husband Telugu Jokes
కొత్తగా పెళ్లి అయిన తరువాత భార్య టిఫిన్ తయారు చెయ్యడానికి రెడీ అవుతుంది. అయినా ఎందుకయినా మంచిదని యూట్యూబ్లో ఒక వీడియో చూసింది ఆ తరువాత స్విచ్చియేషన్…..
భార్య : ఏమండీ……..నేను మా నాన్న దగ్గరికి వెళుతున్న….!!!
భార్య : మీరు ఇడ్లి, దోస చెయ్యమన్నారు కదా…? ఎలా చేయాలో యూట్యూబ్ లో చూసాను.
భర్త : ఆ….అయితే….. పుట్టింటికి దేనికన్నట్టు…?
భార్య : నాన బెట్టిన బియ్యం…..నాన బెట్టిన మినప్పుతో పేస్టు తో చేయాలనీ చెప్పారండి.
భర్త : ఒసే…నీ తెలివి తగలెయ్య….. నాన బెట్టినవి ఆంటీ………..వాళ్ళు పెట్టినవి కాదే
నీళ్లలో నాన బెట్టినవి.
ధైర్యవంతుడు
అర్ధరాత్రి తప్పతాగి ఇంటికొచ్చి తలుపు తడితే….
చీపురుతో కనబడిన భార్యను చూసి బెదరకుండా….
“ప్రియా……. ఇంకా ఇల్లు ఊడుస్తూనే ఉన్నావా…?
కాస్త రెస్ట్ తీసుకో అలసిపోయావేమో…. అనేవాడు.
ఎవరు తెలివైన వారు
భర్త : భార్యని సరదాగా…………ఒక లెంపకాయ కొట్టి
మనం ఎవరినయితే ఎక్కువ ప్రేమిస్తామో……
వాళ్లనే కొట్టాలనిపిస్తుంది తెలుసా అన్నాడుతెలివిగా..
భార్య : వెంటనే…….. భర్తని రెండు లెంపకాయలు….. నాలుగు మొటిక్కాయలు
అయిదు తన్నులు తన్ని బాగా ఉతికి ఆరేశాక………..
మంగళ సూత్రం కళ్ళకి అడ్డుకుంటూ……. నాగురించి మీరు ఏమనుకుంటారన్నారు…..
నేనేమన్నా మిమ్మల్ని తక్కువ ప్రేమిస్తున్నానా అంది.
మరొకటి
అర్ధరాత్రి నిద్ర లేచిన భర్త భర్తను హఠాత్తుగా కొట్టడం స్టార్ట్ చేసాడు…..
భార్య : ఏమైంది….? ఏండ్కుకు కొడుతున్నావు……? అని అదిఅడిగింది.
భర్త : ఎవడే…….నీకు అర్ధరాత్రి నీకు బ్యూటిఫుల్ అని మెసేజ్ పెట్టింది….?
భార్య : తింగరోడా……అది బ్యూటిఫుల్ కాదురా…….బ్యాటరీ పుల్….