ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Kusalammaa Neeku Lyrics in Telugu
కుశలమా నీకు కుశలమేనా
మనసు నిలుపుకోలేకా మరి మరి అడిగాను
అంతే అంతే అంతేఏ
కుశలమా నీకు కుశలమేనా
ఇన్నినాళ్ళు వదలలేకా ఎదో ఎదో వ్రాసాను
అంతే అంతే అంతేఏ
కుశలమా
చిన్నతల్లి ఏమందీ
నాన్న ముద్దు కావాలంది
పాలు గారు చెక్కిలిపైన పాపాయికి ఒకటి
తేనెలూరు పెదవుల పైన దేవిగారికొకటి
ఒకటేనాఆఆ ఒకటేనా ఆఆ
హహ ఎన్నైనాఆఆ హాయ్ ఎన్నెన్నోఓఓ
మనసు నిలుపుకోలేక మరి మరి అడిగాను అంతే అంతే అంతే
కుశలమా హాయ్
పెరటిలోని పూల పానుపు
త్వర త్వరగా రమ్మంది
పొగడ నీడ పొదరిల్లు
దిగులు దిగులుగా ఉంది
ఎన్ని కబురులంపేనో ఎన్ని కమ్మలంపేనో
పూలగాలి రెక్కల పైన నీలి మబ్బు పాయలపైనా
అందేనాఆ ఆ ఒకటైనా ఆ ఆ
అందెనులే తొందర తెలిసెనులే
ఇన్నినాళ్ళు వదలలేకా ఎదో ఎదో వ్రాసాను
అంతే అంతే అంతేఏ
కుశలమా నీకు కుశలమేనా
మనసు నిలుపుకోలేకా మరి మరి అడిగాను
అంతే అంతే అంతేఏ
కుశలమా
Kusalammaa Neeku Lyrics in Telugu