Menu Close

Kurralloy Kurrallu Lyrics In Telugu – Andamaina Anubhavam

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Kurralloy Kurrallu Lyrics In Telugu – Andamaina Anubhavam

కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు
కళ్ళాలే లేనోళ్ళు కవ్వించే సోగ్గాళ్ళు
కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు
కళ్ళాలే లేనోళ్ళు కవ్వించే సోగ్గాళ్ళు
ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు
హద్దులేవి లేనివాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు… రారారరీ ఓ ఓ

కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు… వెర్రెక్కి ఉన్నోళ్ళు
కళ్ళాలే లేనోళ్ళు… కవ్వించే సోగ్గాళ్ళు

గతమున పూడ్చేది వీళ్ళు… హ, చరితను మార్చేది వీళ్ళు
కథలై నిలిచేది వీళ్ళు… హో, కళలకు పందిళ్ళు వీళ్ళు
వీళ్ళేనోయ్ నేటి మొనగాళ్ళు
చెలిమికెపుడూ జతగాళ్ళు… చెడుపుకెపుడు పగవాళ్ళు
వీళ్ళ వయసు నూరేళ్ళు… నూరేళ్ళకు కుర్రాళ్ళు
ఆటగాళ్ళు పాటగాళ్ళు… అందమైన వేటగాళ్ళు
హద్దులేవి లేనివాళ్ళు… ఆవేశం ఉన్నవాళ్ళు, రారార రీ ఓ

కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు… వెర్రెక్కి ఉన్నోళ్ళు
కళ్ళాలే లేనోళ్ళు… కవ్వించే సోగ్గాళ్ళు

తళతళ మెరిసేటి కళ్ళు… హో, నిగనిగలాడేటి ఒళ్ళు
విసిరే చిరునవ్వు జల్లు… హ, ఎదలో నాటెను ముల్లు
తీయాలోయ్ దాన్ని చెలి వేళ్ళు
నిదురరాని పొదరిల్లు… బ్రహ్మచారి పడకిల్లు
మూసిఉన్న వాకిళ్ళు… తెరచినపుడే తిరునాళ్ళు
ఆటగాళ్ళు పాటగాళ్ళు… అందమైన వేటగాళ్ళు
హద్దులేవి లేనివాళ్ళు… ఆవేశం ఉన్నవాళ్ళు, రారార రీ ఓ

నీతులు చెప్పే ముసలాళ్ళు… నిన్న మొన్నటి కుర్రాళ్లు
దులిపెయ్ ఆనాటి బూజులు… హో, మనవే ముందున్న రోజులు
తెంచేసెయ్ పాత సంకెళ్ళు… మనషులె మన నేస్తాలు
కమ్ ఆన్ క్లాప్..! మనసులె మన కోవెళ్ళు ఎవ్రీబడి
మనషులె మన నేస్తాలు… మనసులె మన కోవెళ్ళు
మనకు మనమే దేవుళ్ళు… మార్చిరాయి శాస్త్రాలు
ఆటగాళ్ళు పాటగాళ్ళు… అందమైన వేటగాళ్ళు
హద్దులేవి లేనివాళ్ళు… ఆవేశం ఉన్నవాళ్ళు, రారార రీ ఓ

కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు
కళ్ళాలే లేనోళ్ళు కవ్వించే సోగ్గాళ్ళు
కమ్ ఆన్ ఎవ్రీబడి జాయిన్ టుగెదర్

Like and Share
+1
3
+1
1
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading