Menu Close

Kummari O Kummari Lyrics In Telugu – Telugu Christian Songs


Kummari O Kummari Lyrics In Telugu – Telugu Christian Songs

కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి
జిగట మన్నైన నా వంక… చల్లగ చూడుమయ్యా
ఆఆ ఆ..! చల్లగ చూడుమయ్యా

Special Offer: కరెంట్ పోయినప్పుడు దాదాపు 4 గంటలు ఆన్లో వుండే బల్బ్ - Buy Now

పనికిరాని పాత్రనని… పారవేయకుమా
పొంగి పొరలు పాత్రగా… నన్ను నింపుమా ||2||
సువార్తలోని పాత్రలన్నీ… శ్రీ యేసుని పొగడుచుండ
సాక్షిగానుండు పాత్రగజేసి… సత్యముతో నింపుము తండ్రి
ఆఆ ఆ..! సత్యముతో నింపుము తండ్రి
కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి

విలువలేని పాత్రను నేను… కొనువారు లేరెవ్వరు
వెలలేని నీదు రక్తంబుతో… వెలుగొందు పాత్రగజేసి ||2||
ఆటంకములనుండి తప్పించి… నన్ను ఎల్లప్పుడు కావుమయ్యా
పగిలియున్న పాత్రను నేను… సరిచేసి వాడుమయ్యా
ఆఆ ఆ..! సరిచేసి వాడుమయ్యా
కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి

లోకాశతో నిండి ఉప్పొంగుచూ… మార్గంబు నే దప్పితిన్
మనుషేచ్ఛలన్నియు స్థిరమనుచునే… మనశ్శాంతి కోల్పోతిని ||2||
పోగొట్టుకున్న పాత్రయనుచు… పరుగెత్తి నను పట్టితివి
ప్రాణంబు నాలో ఉన్నప్పుడే… నీ పాదంబుల్ పట్టితిన్
ఆఆ ఆ..! నీ పాదంబుల్ పట్టితిన్

కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి
జిగట మన్నైన నా వంక… చల్లగ చూడుమయ్యా
ఆఆ ఆ..! చల్లగ చూడుమయ్యా

Kummari O Kummari Lyrics In Telugu – Telugu Christian Songs

Like and Share
+1
0
+1
0
+1
0
Posted in Telugu Christian Songs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading