Menu Close

Kukka Kavali Song Lyrics In Telugu – Chitram

Kukka Kavali Song Lyrics In Telugu – Chitram

కుక్క కావాలి, కుక్క కావాలి… కుక్క కావాలి
అన్నయ్యా..! కుక్క కావాలి, కుక్క కావాలి

వినరా బ్రదరూ..! అయోధ్యనేలే రాముని స్టోరీ
దశరధ రాజుకు వారసుడు… సకల శాస్త్రాల కోవిదుడు
అస్త్రవిద్యలో ఫస్టతడు… మంచి గుణాల లిస్టతడు
ఎట్లుంటడో ఎరికెనా…! బ్లూకలర్ల మస్తుగుంటడు
లక్ష్మణుడని బ్రదరున్నాడు… అన్నకి అండగ నిలిచాడు
సెల్ఫిష్ నెస్సుని విడిచాడు… సేవే గొప్పని తలచాడు

ఈనా బ్లూకలరేనా..!!
బ్రదర్సు ఒకటేగాని… కలర్సు వేర్రా నాని
ధమాక్ ఖరాబైందా సార్ నీకు..!
అన్నదమ్ములేమో ఒకటంటవ్… రంగులేమో అలగలగంటవ్
కథ మంచిగ చెప్పుర్రి సార్… నీకు దండం పెడ్త

సీతాదేవను వైఫు ఉన్నది… రామునితోనే లైఫు అన్నది
హానెస్టి తన వైనమన్నది… ఫారెస్టునకే పయనమైనది
రాముని సేవకు తొలిబంటు… అతిబలవంతుడు హనుమంతు
నమ్మిన బంటుగ రాముని పదముల చెంతే ఉంటాడు, పదముల చెంతే ఉంటాడు
సూన్నీకి కోతి లెక్కుంటడు గానీ..!
రామసామిని ఎవ్వడన్నా ఎమన్నా అన్నాడనుకో… కుక్కని కొట్టినట్టు కొడతాడు
ఆ..! కుక్క కుక్క కావాలి, కుక్క కావాలి

అసలు నిన్నెవడ్రా మాట్లాడమంది..! సార్ ఇప్పుడు..!
వీడ్ని నోరు మూసి పక్కకు లాక్కెల్లిపొండ్రా నోరిప్పనీయద్దసలు

Winter Needs - Hoodies - Buy Now

అతల వితల సుతల తలాతల రసాతల పాతాళ లోకములో
అవిక్రమ పరాక్రముండు కురువంశొద్భవుండు సుయోధనుండు, హాహాహా
రారాజు సోదరులు హండ్రెడు, తకతకిట
ఆ పాండవులతో ఉండరు, తకతకిట
వాటాలలోన వాదమొచ్చిందీ… బిగ్ వారు దాకా తీసుకొచ్చిందీ

ద్రౌపదీ వస్త్రాపహరణం… ఆపలేదెవరూ దారుణం
పులిలాగ భీమన్న జంపించినాడు… బలశాలి కోపంతొ కంపించినాడు
గద ఎత్తినాడు తొడ కొట్టినాడు… గద ఎత్తినాడు తొడ కొట్టినాడు
గద ఎత్తినాడు తొడ కొట్టినా..!
రారాజు గుండెల్ని చీల్చుతానంటూ… నిండు సభలో తాను ప్రతిన పూనాడు

క్లైమాక్స్ల ఫైటింగ్ షురు ఐంది
భీముడు గద తీసిండు పిసికిండు
దుర్యొధనుడు బీ గద తీసిండు పిసికిండు
ఎవ్వడి తొడలు ఆల్లాల్లు కొట్టుకున్నరు
ఆడు కొట్టిండు ఈడు కొట్టిండు… ఆడు కొట్టిండు ఈడు కొట్టిండు
ఆడు తలకాయ మీద కొడ్తె… ఈడు కాల్మీద కొట్టిండు
ఆడు కాల్మీద కొడ్తె… ఈడు తలకాయ మీద కొట్టిండు
కొట్టిర్రు కొట్టిర్రు…
అరె ఎంతైనా భీముడు హీరొ కదబై… దుర్యొధనుడు ఖాళీ విలన్
ఎమైతది..! భీముని చేత్ల కుక్క సావు సచ్చిండు, హాహాహా
ఆ..! కుక్క కుక్క కావాలి, కుక్క కావాలి

అయ్యో..! మళ్ళి గుర్తుచేసాడ్రా… అయితే ఇప్పుడెట్ల
నువ్వు చెప్పు నువ్వు చెప్పు… ఎహె ఆపండి
ఒరే శ్రీశైలం..! మద్యలో వచ్చుడు కాదుగాని నువ్వు చెప్పురా..!!

అరెరెరే చిన్న పోరన్కి కథ చెప్పనీకొస్తల్లేదువయ్యా
ఏం చదువుకున్నరు మీరు
ఇస్టోరి నే చెప్తా… చెవులు పెట్టి ఇనుండ్రి

ఏడేడు లోకాల యాడుంది… అంతటి అందం ఓయమ్మ
పుత్తడి బొమ్మల్లె ఉంటుంది… బ్రదరూ బాలనాగమ్మ

జంతరు మంతరు మోళీ చేసే మరాఠ మాంత్రికుడు మాయల ఫకీరు వంచకుడు
అందరిలోన సుందరికోసం దుర్భిణి వేసాడు ఎన్నో ప్లానులు గీసాడు
దుర్భిణిలోన బాలనాగమ్మ రూపం కనిపించి ఆమెను ఇట్టే మోహించీ
బెగ్గరు వేషం వేసుకొచ్చాడు జిత్తుల మాంత్రికుడు మాయల ఫకీరు వంచకుడు

గప్పుడు ఏమైందో ఎర్కెనా..!
మాయల ఫకీరుగాడు తన చేతిల ఉన్న మంత్రం కట్టెతోని
బాలనాగమ్మ తలకాయ మీద ఒక్కటేసిండు
గంతే..! బాలనాగమ్మ మారిపోయింది..!
ఎలా మారిపోయింది…? అదే మారిపోయిందని చెప్పినకదా
అదే ఎలా మారింది..? అరె ఎన్నిసార్లు చెప్తర్ బై,
టాప్ టు బాటం టోటల్ మారిపోయిందంతే
చెప్తావా లేదా..? చెప్ప… చెప్తావా లేదా..? చెప్పా
చెప్పు, మీ దండం పెడ్త చెప్ప
చెప్పు..! ఏం కొడ్తరా..?… ఆ
అందరు కొడ్తరా..??… డౌటా..!!
ఏ డౌటేంలె..!! చెప్పినా చెప్పకున్న కొడ్తరు… మాటర్ అసుంటిది
మీ చెతులల్ల నే చావనీకి కుక్క లెక్క మారిందిబై

కుక్క కావాలి, కుక్క కావాలి… కుక్క కావాలి కుక్క కావాలి

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
బిగ్గ్ బాస్ 8 తెలుగులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ?

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading