ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Kotha Kothaga Lyrics in Telugu – Coolie No 1
కొత్త కొత్తగా ఉన్నది… స్వర్గమిక్కడే అన్నది
కోటి తారలే… పూల ఏరులై
కోటి తారలే… పూల ఏరులై, నేల చేరగానే…
కొత్త కొత్తగా ఉన్నది… స్వర్గమిక్కడే అన్నది
నా కన్ను ముద్దాడితే… కన్నె కులుకాయె కనకాంబరం
నా చెంప సంపెంగలో… కెంపు రంగాయె తొలి సంబరం
ఎన్ని పొంగులో కుమారి కొంగులో…
ఎన్ని రంగులో సుమాల వాగులో…
ఎన్ని పొంగులో కుమారి కొంగులో..
ఎన్ని రంగులో సుమాల వాగులో..
ఉద్యోగమిప్పించవా… సోకు ఉద్యాన వనమాలిగా
జీతమియ్యగా లేత వన్నెలే చెల్లించుకోనా..!
కొత్త కొత్తగా ఉన్నది… స్వర్గమిక్కడే అన్నది
కోటి తారలే… పూల ఏరులై
కోటి తారలే… పూల ఏరులై, నేల చేరగానే…
కొత్త కొత్తగా ఉన్నది… స్వర్గమిక్కడే అన్నది
నీ నవ్వు ముద్దాడితే… మల్లెపువ్వాయె నా యవ్వనం
నాజుకు మందారమే… ముళ్ళ రోజాగ మారే క్షణం…
మొగలి పరిమళం మొగాడి కౌగిలి…
మగువ పరవశం సుఖాల లోగిలి…
మొగలి పరిమళం మొగాడి కౌగిలి…
మగువ పరవశం సుఖాల లోగిలి…
కండల్లో వైశాఖమా… కైపు ఎండల్లో కరిగించుమా
తీగమల్లికి, నరాల పందిరి… అందించుకోనా..!
కొత్త కొత్తగా ఉన్నది… స్వర్గమిక్కడే అన్నది
కోటి తారలే… పూల ఏరులై
కోటి తారలే… పూల ఏరులై, నేల చేరగానే…
కొత్త కొత్తగా ఉన్నది… స్వర్గమిక్కడే అన్నది