ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Kotha Bangaaru Lokam Lyrics in Telugu – Donga Donga
పల్లవి :
కొత్త బంగారులోకం మాకు కావాలి సొంతం
గాలి పాడాలి గీతం పుడమికావాలి స్వర్గం
కొత్త బంగారులోకం మాకు కావాలి సొంతం
గాలి పాడాలి గీతం పుడమి కావాలి స్వర్గం
కొత్త బంగారులోకం మాకు కావాలి సొంతం
గాలి పాడాలి గీతం పుడమి కావాలి స్వర్గం
కొత్త బంగారులోకం మాకు కావాలి సొంతం
గాలి పాడాలి గీతం పుడమి కావాలి స్వర్గం
చరణం : 1
జంతరల వంకలుండే నింగి కావాలి మాకు
వెండి వెన్నెల్లలోనె వెయ్యి కలలు పండాలి మాకు
పువ్వులే నోరు తెరిచి మధుర రాగాలు నేర్చి
పాటలే పాడుకోవాలి అది చూసి నే పొంగిపోవాలి
మనసనే ఒక సంపదా ప్రతి మనిషిలోనూ ఉండనీ
మమతలే ప్రతి మనసులో కొలువుండనీ
మనుగడే ఒక పండగై కొనసాగనీ
కొత్త బంగారులోకం మాకు కావాలి సొంతం
గాలి పాడాలి గీతం పుడమి కావాలి స్వర్గం
చరణం : 2
ఓడిపోవాలి స్వార్ధం ఇల మరచిపోవాలి యుద్ధం
మరణమే లేని మానవులె ఈ మహిని నిలవాలి కలకాలం
ఆకలే సమసిపోనీ అమృతం పొంగిపోనీ
శాంతి శాంతి అను సంగీతం ఇంటింట పాడనీ ప్రతి నిత్యం
భేదమే ఇక తొలగనీ వేడుకే ఒక వెలగనీ
ఎల్లల పోరాటమే ఇక తీరనీ
ఎల్లరూ సుఖశాంతితో ఇక బతకనీ
కొత్త బంగారులోకం మాకు కావాలి సొంతం
గాలి పాడాలి గీతం పుడమి కావాలి స్వర్గం