ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
కొంచెం కొంచెం కొడవలివై కోసుకున్నావే
పిల్ల నన్నే నీ కంటి చూపుతో
ఇంకా కొంచెం దగ్గరగా చేరుకున్నావే
పెదవే తెరచి నీ పేరు తెలుపుతూ
కొమ్మల్లో పట్టు తేనే లంగా ఓణి కట్టుకొని
నీలా ఎదురైందే పేరు పెట్టుకొని
మల్లి మల్లి నువ్వు నా నూరేళ్ళే
తోడై రావే నా ఎద నీ ఇల్లే
మల్లి మల్లి నువ్వు నా నూరేళ్ళే
తోడై రావే నా ఎద నీ ఇల్లే
కొంచెం కొంచెం కొడవలివై కోసుకున్నావే
పిల్ల నన్నే నీ కంటి చూపుతో
చినుకులేని జడివానలో తడిసిపోతున్నా
గొడుగులేని నీడలోన నిలబడి ఉన్న
మేలుకొని వేల వేల కలలు కంటున్నా
ప్రతి కలలో మన కలయిక నే చూస్తున్న
మొరటు హృదయంలో ప్రేమను మొలిపించి
మనసుకి మరుజన్మను అందించావే
మల్లి మల్లి నువ్వు నా నూరేళ్ళే
తోడై రావే నా ఎద నీ ఇల్లే
మల్లి మల్లి నువ్వు నా నూరేళ్ళే
తోడై రావే నా ఎద నీ ఇల్లే
కొండమీద గుడిలోపలి దేవత నీవు
నాకోసం గుడిసెలోకి దిగి వచ్చావు
నది ఒడిలో నడియాడే పడవవి నీవు
నన్నే నీ తీరమని చేరుకున్నావు
మూడు ముళ్ళేసి జన్మజన్మలకి
చేయి వీడనని మాటిస్తున్నా నే
తోడై రావే నా ఎద నీ ఇల్లే
మల్లి మల్లి నువ్వు నా నూరేళ్ళే
తోడై రావే నా ఎద నీ ఇల్లే
కొంచెం కొంచెం కొడవలివై కోసుకున్నావే
పిల్ల నన్నే నీ కంటి చూపుతో
ఇంకా కొంచెం దగ్గరగా చేరుకున్నావే
పెదవే తెరచి నీ పేరు తెలుపుతూ