Kommana Kulike Koyila Song Lyrics In Telugu - Maavichiguru - Telugu Bucket
Menu Close

Kommana Kulike Koyila Song Lyrics In Telugu – Maavichiguru

కొమ్మన కులికే కోయిల… ఓ కమ్మని పాట పాడవే
కమ్మగ నవ్వే నెచ్చెలి… నీ అందెల సవ్వడి చెయ్యవే
ఓ ఓ ఓ మామా… ఓ ఓ ఓ భామా
ఎదలోయల దాగిన చిత్రమా… కనుసైగలు చేసిన ఆత్రమా
ఉదయాలకు నీవే ప్రాణమా… కసి ముద్దులు రాసిన కావ్యమా
వయారాల వీణ మీటి దోచుకున్న నేస్తమా

కొమ్మన కులికే కోయిల… ఓ కమ్మని పాట పాడవే
తేనెలు మరిగిన తుమ్మెదా… కనుచూపుల గారడి చేయకే

చెప్పేయ్ వా చెవిలోన ఒక మాట
పువ్వులతో తుమ్మెద చెప్పేమాటా, ఆ ఆ
నీ చిరునవ్వు సాక్షిగా తాజ్ మహల్ నాదట
నీ పెదవంచు సాక్షిగా షాజహాను నేనట
నీ తియ్యని ప్రేమకి నా పెదవే నజరానా
నీ పైటకి నేనిక బానిసనే నెరజాణ
అనంతాల ఆర్థ నీవై చేరుకున్న వేళలో

కోకలు కట్టిన కోయిలా… ఓ కమ్మని కౌగిలియ్యవే
తేనెలు మరిగిన తుమ్మెదా… కను చూపుల గారడి చేయకే

పూసింది కౌగిట్లో పులకింత… వెచ్చంగా పాకింది ఒళ్ళంతా
పదహారేళ్ళ యవ్వనం… పదిలంగా దాచిన
నీ మెడలోని తాళినై నూరేళ్లు దాగన
నీ చెంతకు చేరా విరహంతో పడలేక
నునుమెత్తని పరువం రాసింది శుభలేఖ
సరగాల సాగరాన స్వాతిచినుకై సోలిపో

కొమ్మన కులికే కోయిల… ఓ కమ్మని పాట పాడవే
తేనెలు మరిగిన తుమ్మెదా… నీ అల్లరి పనులిక ఆపవే
ఓ ఓ ఓ భామా…  ఓ ఓ ఓ మామ
ఉదయాలకు నీవే ప్రాణమా… కసి ముద్దులు రాసిన కావ్యమా
ఎదలోయల దాగిన చిత్రమా… కనుసైగలు చేసిన ఆత్రమా
వయారాల వీణ నీవై దోచుకున్న అందమా

కొమ్మన కులికే కోయిల… ఓ కమ్మని పాట పాడవే
కమ్మగ నవ్వే నెచ్చెలి… నీ అందెల సవ్వడి చెయ్యవే

Like and Share
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

Leave a Reply

Your email address will not be published.

Subscribe for latest updates

Loading