ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Komma Meeda Kokilamma Song Lyrics in Telugu
కొమ్మ మీద కోకిలమ్మ కుహూ అన్నది
కుహు కుహూ అన్నది
అది కూన విన్నదీ
ఓహో అన్నది
కొమ్మ మీద కోకిలమ్మ కుహూ అన్నది
కుహు కుహూ అన్నది
అది కూన విన్నదీ
ఓహో అన్నది
ఈనాడు చిగురించు… చిగురాకు వగరే
ఏ గొంతులో రేపు… ఏ రాగమౌనో
ఈనాడు చిగురించు… చిగురాకు వగరే
ఏ గొంతులో రేపు… ఏ రాగమౌనో
నాడు ఆ రాగమే… గుండె జతలో
తానె శృతి చేసి… లయకూర్చునో
నాడు ఆ రాగమే… గుండె జతలో
తానే శృతి చేసి… లయకూర్చునో
అని తల్లి అన్నది… అది పిల్ల విన్నది
విని నవ్వుకున్నదీ… కలలు కన్నది
అని తల్లి అన్నది… అది పిల్ల విన్నది
విని నవ్వుకున్నదీ… కలలు కన్నది
కొమ్మ మీద కోకిలమ్మ కుహూ అన్నది
కుహు కుహూ అన్నది
అది కూన విన్నదీ
ఓహో అన్నది
ఈ లేత హృదయాన్ని కదిలించినావు
నాలోన రాగాలు పలికించినావు
ఈ లేత హృదయాన్ని కదిలించినావు
నాలోన రాగాలు పలికించినావు
నాకు తెలిసింది… నీ నిండు మనసే
నేను పాడేది… నీ పాటనే
నాకు తెలిసింది… నీ నిండు మనసే
నేను పాడేది… నీ పాటనే
అని ఎవరు అన్నది… అది ఎవరు విన్నది
ఈ చిగురు చెవులకే… గురుతు ఉన్నది
అని ఎవరు అన్నది… అది ఎవరు విన్నది
ఈ చిగురు చెవులకే… గురుతు ఉన్నది
కొమ్మ మీద కోకిలమ్మ కుహూ అన్నది
కుహు కుహూ అన్నది
అది కూన విన్నదీ
ఓహో అన్నది