Menu Close

Komma Komma Song Lyrics In Telugu – Nuvvu Vasthavani


Komma Komma Song Lyrics In Telugu – Nuvvu Vasthavani

ఆ ఆఆ ఆ ఆఆ ఆఆ
కొమ్మా కొమ్మా విన్నావమ్మా… కోయిల వస్తుంది
వస్తూ వస్తూ తనతో వెన్నెల వెలుగులు తెస్తుంది
ఏవమ్మా మరుమల్లి… తోరణాలు కడతావా
చిలకమ్మ ఎదురేగి… స్వాగతాలు చెపుతావా
పూల పొదరిల్లే రా రమ్మందని
విన్నానమ్మా తియ్యని వేణువు… రమ్మను పిలుపులని
చూశానమ్మా స్వాగతమంటూ… తెరిచిన తలపులని

పగలూ రాత్రి అంటూ… తేడా లేనే లేదు
పసిపాప నవ్వుల్ని చూడనీ
తోడూ నీడా నువ్వై… నాతో నడిచే నీతో
ఏనాటి ఋణముందో అడగనీ
చేదు చేదు కలలన్నీ… కరిగితేనె వరదవని
కానుకైన స్నేహాన్ని… గుండెలోన దాచుకుని
ప్రతి జన్మకి ఈ నేస్తమే కావాలనీ
కోరుకుంటానమ్మా దేవుళ్లని

కొమ్మా కొమ్మా విన్నావమ్మా కోయిల వస్తుంది
విన్నానమ్మా తియ్యని వేణువు రమ్మను పిలుపులని

పని పని పని పని పమపగ గస సన
పని పని పని పని పమపగ గస సన
సాగ గననీసా పని సాగ గననీసా

ఇదిగో నిన్నే అంటూ… ప్రేమే ఎదురై వస్తే
ఏ పూలు తేవాలి పూజకీ
నీతో జతగా ఉండే… వరమే నువ్వే ఇస్తే
ఇంకేమి కావాలి జన్మకీ

మచ్చలేని చంద్రుడిని… మాటరాక చూస్తున్నా
వరుస కాని బంధువుని… చొరవచేసి అంటున్నా
ఇంకెప్పుడు ఒంటరినని అనరాదనీ
నీకు సొంతం అంటే నేనేననీ

కొమ్మా కొమ్మా విన్నావమ్మా… కోయిల వస్తుంది
వస్తూ వస్తూ తనతో వెన్నెల వెలుగులు తెస్తుందీ
ఏవమ్మా మరుమల్లి… తోరణాలు కడతావా
చిలకమ్మ ఎదురేగి… స్వాగతాలు చెపుతావా
పూల పొదరిల్లే రా రమ్మందని

విన్నానమ్మా తియ్యని వేణువు రమ్మని పిలుపులని
చూశానమ్మా స్వాగతమంటూ తెరిచిన తలపులని

Like and Share
+1
0
+1
0
+1
0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading