ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Komma Komma Remma Remma Bathukamma Song Lyrics – 2022
Komma Komma Remma Remma Bathukamma Song Lyrics written by Gasiganti Rajalingam, sung by Vani Vollala, Laxmi & Maheshwari, and music composed by SK.Baji.
కొమ్మకొమ్మ రెమ్మరెమ్మ పూలు పూసెనే
నేలంత నిండుపూల జాతరాయెనే
వాకిలలికే చేతులన్ని పూలు పేర్చెనే
అమ్మలక్కలంత బతుకమ్మలాడెనే
పల్లె మట్టిగొంతులన్నీ… పాట పాడెనే
పల్లె మట్టిగొంతులన్నీ… పాట పాడెనే
గాజుల చప్పట్లు గల్లుగల్లున మోగెనే
లాయి లాయి… లాయి లాయి లాయి లాయిరే
కోలు కోలు… కోయిలాలో కొమ్మలాయిరే
లాయి లాయి… లాయి లాయి లాయి లాయిరే
కోలు కోలు… కోయిలాలో కొమ్మలాయిరే
కోడికూత పెట్టగానే… రాం భజనా
ఎడ్లబండి గట్టిరే… రాం భజనా
అన్నలు తమ్ముళ్లు… రాం భజనా
సేనుకు పోయిరి… రాం భజనా
సెట్టుపుట్టలు తిరిగి… రాం భజనా
బుట్టనిండ పూలేరి… రాం భజనా
ఒక్కొక్క పువ్వేసి… రాం భజనా
బతుకమ్మను జేసె… రాం భజనా
రెండొక్క పువ్వేసి… రాం భజనా
గౌరమ్మను జేసె… రాం భజనా
సేనుగట్టు మీద… గునక పువ్వు పూసెనే
సెరువులోని కలువపూలు… కండ్లు తెరిసెనే
పుట్టమన్ను మీద తంగేడు పూసెనే
జమ్మిచెట్టు మీద… పాలపిట్ట చూసెనే
ఆలమందాలన్నీ గంతేసి దూకెనే
ఆలమందాలన్నీ గంతేసి దూకెనే
కొంగల గుంపులు కోలాటమాడెనే
లాయి లాయి… లాయి లాయి లాయి లాయిరే
కోలు కోలు… కోయిలాలో కొమ్మాలాయిరే
లాయి లాయి… లాయి లాయి లాయి లాయిరే
కోలు కోలు… కోయిలాలో కొమ్మాలాయిరే
పూలతల్లి బతుకమ్మ… పండుగొచ్చెనే
అక్కబావను తోల్కపోను తమ్ముడొచ్చెనే
సిన్నన్న సిరిసిల్ల… చీర తెచ్చెనే
పెద్దన్న గద్వాల… పట్టుచీర తెచ్చెనే
నిండుపున్నమి వోలె నిగనిగ మెరిసే
నిండుపున్నమి వోలె నిగనిగ మెరిసే
జాజిమల్లె తీరు మా చెల్లి మురిసే
లాయి లాయి… లాయి లాయి లాయి లాయిరే
కోలు కోలు… కోయిలాలో కొమ్మాలాయిరే
లాయి లాయి… లాయి లాయి లాయి లాయిరే
కోలు కోలు… కోయిలాలో కొమ్మాలాయిరే
గెనిగపూల బతుకమ్మ ఎన్నియాలో
నువ్వులపిండి నూకలిద్దం ఎన్నియాలో
అటుకుల బతుకమ్మ ఎన్నియాలో
సద్దుపప్పు అటుకులిద్దం ఎన్నియాలో
ముద్దపప్పు బతుకమ్మ ఎన్నియాలో
ముద్దపప్పు బెల్లమిద్దం ఎన్నియాలో
నానబియ్యం బతుకమ్మ ఎన్నియాలో
పాలు బెల్లం అట్లు ఎన్నియాలో
వేపకాయ బతుకమ్మ ఎన్నియాలో
బియ్యంపిండి వేంచుదాము ఎన్నియాలో
వెన్నముద్దల బతకమ్మ ఎన్నియాలో
వెన్ననెయ్యి బెల్లమిద్దం ఎన్నియాలో
సద్దుల బతుకమ్మ ఎన్నియాలో
సద్దుల బతుకమ్మ ఎన్నియాలో
సత్తుపిండి పంచుదాము ఎన్నియాలో
అటుకుల బతుకమ్మ… అలుకు సల్లెనే
ముద్దపప్పు బతుకమ్మ ముగ్గులేసెనే
ఇంద్రధనసు మెరిసినట్టు… ఊరు మురిసెనే
పూలతోని అలికినట్టు… నేల మెరిసినే
సద్దుల బతుకమ్మ సంబరాలు నింగినంటే
సద్దుల బతుకమ్మ సంబరాలు నింగినంటే
ఊరువాడ ఉయ్యాల పాటలే మారుమోగే
జాజి జాజి.. జాజి జాజి జాజి కొమ్మలో
సెరువుగట్టు సెరెనమ్మ బతుకమ్మలో
జాజి జాజి.. జాజి జాజి జాజి కొమ్మలో
పోయిరా గౌరమ్మ గంగ చెంతకు
జాజి జాజి.. జాజి జాజి జాజి కొమ్మలో
మళ్ళీరా గౌరమ్మ పుట్టింటికో.. ..
Lyrics: Gasiganti Rajalingam
Singers: Vani Kishore Vollala, Lakshmi Folk Singer & Maheshwari
Music SK.Baji
Song Lable & Copyright: Mic Tv
Komma Komma Remma Remma Bathukamma Song Lyrics – 2022