ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Kolo Kolamma Galla Lyrics in Telugu – Kondaveeti Donga
పల్లవి:
కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ
కోరింది ఇచ్చుకోవా
చేలో నీ సోకులన్ని సోలోగా పాడుకుంటా
నా ముద్దు పుచ్చుకోవా
లాటుగా అందాలన్ని చాటుగా ఇస్తావా
ఘాటుగా కౌగిళ్ళు ఇచ్చి మార్చుకోమంటావా
కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ
కోరింది ఇచ్చుకోవా
చేలో నీ సోకులన్ని సోలోగా పాడుకుంటా
నా ముద్దు పుచ్చుకోవా
చరణం 1:
కొండ కోనల్లో చాటుగా
ఎత్తు పల్లాలు తెలిసేలే
కంటి కోణాలు సూటిగా
కొంటె బాణాలు విసిరేలే
సోకినా నా ఒళ్ళు కోకలో కళ్ళు పడ్డ నీ ఒళ్ళు వదలనూ
చూపుకే సుళ్ళు తిరిగి నా ఒళ్ళు కట్టు కౌగిళ్ళు వదలకూ
కుదేసాక అందాలన్ని కుదేలైన వేళల్లో
పడేసాకా వల్లో నన్నే ఒడే చాలు ప్రేమల్లో
సందె ఓ షేపు చిందే ఓ వైపు అందే నీ సోకులే
తణక్కు దిన
చేలో నీ సోకులన్ని సోలోగా పాడుకుంటా
నా ముద్దు పుచ్చుకోవా
కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ
కోరింది ఇచ్చుకోవా
చరణం 2:
మెత్తగా తాకు చూపుకే
మేలుకున్నాయి సొగసులే
కోత్తగా తాకు గాయమే
హాయి అన్నాయి వయసులే
కుర్ర నా ఈడు గుర్రమై తన్నే గుట్టుగా గుండెలదరగా
కళ్ళతో నీకు కళ్ళెమేసాను కమ్ముకో నన్ను కుదురుగా
భరోసాల వీరా రారా…భరిస్తాను నీ సత్తా
శృతేమించు శృంగారంలో…రతే నీకు మేనత్తా
ముద్దు ఆ వైపు… రుద్దు ఈ వైపు…
హద్దులే లేవులే…
తణక్కు దిన
కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ
కోరింది ఇచ్చుకోవా
చేలో నీ సోకులన్ని సోలోగా పాడుకుంటా
నా ముద్దు పుచ్చుకోవా
లాటుగా అందాలన్ని చాటుగా ఇస్తావా
ఘాటుగా కౌగిళ్ళు ఇచ్చి మార్చుకోమంటావా
కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ
కోరింది ఇచ్చుకోవా
చేలో నీ సోకులన్ని సోలోగా పాడుకుంటా
నా ముద్దు పుచ్చుకోవా