ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Koila Paata Bagunda Song Lyrics In Telugu – Ninne Premistha
కోయిల పాట బాగుందా… కొమ్మల సడి బాగుందా
పున్నమి తోట బాగుందా… వెన్నెల సిరి బాగుందా
కోయిల పాట బాగుందా… కొమ్మల సడి బాగుందా
పున్నమి తోట బాగుందా… వెన్నెల సిరి బాగుందా
అందమైన మల్లె బాల బాగుందా… అల్లిబిల్లి మేఘమాల బాగుందా
చిలకమ్మా చెప్పమ్మా… చిరుగాలి చెప్పమ్మా
కోయిల పాట బాగుందా… కొమ్మల సడి బాగుందా
పున్నమి తోట బాగుందా… వెన్నెల సిరి బాగుందా
అప్పుడెప్పుడో గున్నమామి తోటలో… అట్లతద్ది ఊయలూగినట్లుగా
ఇప్పుడెందుకో అర్థరాత్రి వేళలో… గుర్తుకొస్తోంది కొత్త కొత్తగా
నిదురించిన ఎద నదిలో… అలలెగిసిన అలజడిగా
తీపితీపి చేదు ఇదా… వేపపూల ఉగాది ఇదా
చిలకమ్మా చెప్పమ్మా… చిరుగాలి చెప్పమ్మా
కోయిల పాట బాగుందా… కొమ్మల సడి బాగుందా
పున్నమి తోట బాగుందా… వెన్నెల సిరి బాగుందా
మబ్బు చాటులో ఉన్న వెన్నెలమ్మకి… బుగ్గ చుక్కలాగ ఉన్న తారక
కొబ్బరాకుతో అల్లుకున్న బొమ్మకి… పెళ్ళిచుక్క పెట్టినట్టు ఉందిగా
కలలు కనే కన్నులలో… కునుకెరగని కలవరమా
రేయిలోని పలవరమా… హాయిలోని పరవశమా
చిలకమ్మా చెప్పమ్మా… చిరుగాలి చెప్పమ్మా
కోయిల పాట బాగుంది… కొమ్మల సడి బాగుంది
పున్నమి తోట బాగుంది… వెన్నెల సిరి బాగుంది
అందమైన మల్లె బాల బాగుంది… అల్లిబిల్లి మేఘమాల బాగుంది
చిలకమ్మా బాగుంది… చిరుగాలి బాగుంది
కోయిల పాట బాగుంది… కొమ్మల సడి బాగుంది
పున్నమి తోట బాగుంది… వెన్నెల సిరి బాగుంది