ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Kinnerasani Vachindamma Lyrics In Telugu – Sitara
తన్ననన్ననన్న… తన్ననన్ననన్న
తన్ననన్ననన్న… తన్ననన్ననన్న
చమ్మక్కు చమ్మక్కు… జింజిన్న జింజిన్న
చమ్మక్కు చమ్మక్కు.. జిన్నా జిన్నా జిన్నా
కిన్నెరసాని వచ్చిందమ్మా… వెన్నెల పైటేసి
జమ్మక్కు జమ్మక్కు… జింజిన్న జింజిన్న
జమ్మక్కు జమ్మక్కు.. జిన్నా జిన్నా జిన్నా
కిన్నెరసాని వచ్చిందమ్మా… వెన్నెల పైటేసి
విశ్వనాధ పలుకై… అది విరుల తేనె చినుకై
కూనలమ్మ కులుకై… అది కూచిపూడి నడకై
పచ్చని చేల తన్ననన్న… పావడ గట్టీ తన్ననన్న
పచ్చని చేల పావడ గట్టీ… కొండమల్లెలె కొప్పునబెట్టి
వచ్చె దొరసాని… మా వన్నెల కిన్నెరసాని
కిన్నెరసాని వచ్చిందమ్మా… వెన్నెల పైటేసి
కిన్నెరసాని వచ్చిందమ్మా… వెన్నెల పైటేసి
ఎండల కన్నె సోకని రాణి… పల్లెకు రాణి పల్లవపాణి
కోటను విడిచి… పేటను విడిచి
కనులా గంగా… పొంగే వేళ
నదిలా తానే… సాగే వేళ
రాగాల రాదారి… పూదారి అవుతుంటే
ఆ రాగాల రాదారి… పూదారి అవుతుంటే
కిన్నెరసాని వచ్చిందమ్మా… వెన్నెల పైటేసి
కిన్నెరసాని వచ్చిందమ్మా… వెన్నెల పైటేసి
మాగాణమ్మ చీరలు నేసె…
మలి సందెమ్మ… కుంకుమ పూసే
మువ్వల బొమ్మా… ముద్దుల గుమ్మా
మువ్వల బొమ్మా… ముద్దుల గుమ్మా
గడప దాటి… నడిచే వేళ
అదుపే విడిచి… ఎగిరే వేళ
వయ్యారి అందాలు… గోదారి చూస్తుంటే
ఈ వయ్యారి అందాలు… గోదారి చూస్తుంటే
కిన్నెరసాని వచ్చిందమ్మా… వెన్నెల పైటేసి
కిన్నెరసాని వచ్చిందమ్మా… వెన్నెల పైటేసి
విశ్వనాధ పలుకై… అది విరుల తేనె చినుకై
కూనలమ్మ కులుకై… అది కూచిపూడి నడకై
పచ్చని చేల తన్ననన్న… పావడ గట్టీ తన్ననన్న
పచ్చని చేల పావడ గట్టీ… కొండమల్లెలె కొప్పునబెట్టి
వచ్చె దొరసాని… మా వన్నెల కిన్నెరసాని
వచ్చె దొరసాని… మా వన్నెల కిన్నెరసాని