ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Kila Kila Navve Koyila Kosam Song Lyrics In Telugu – Suryavamsam
లలల లలల లల లల లల లలల
కిల కిల నవ్వే కోయిల కోసం… వచ్చిందీ మధుమాసం
మిల మిల మెరిసే చంద్రుడి కోసం… తెర తీసెను సాయంత్రం
జోలగా లాలించగా నీ నీడ దొరికింది
కమ్మగా కలలీయగా నీ తోడు నాకుంది
ఎద విల్లును వంచిన వాడే… నీ రాముడు అన్నది మనసే
గుడి తలుపులు తియ్యక ముందే… వరమిచ్చెను దేవత ఎదురై
నీదే ఆ చెలి… నిజమేనా జాబిలీ
కిల కిల నవ్వే కోయిల కోసం వచ్చింది మధుమాసం
ఎదురు చూపులో ఎంత తీపని… తెలియలేదు మునుపు
ఎదురు చూడని ఇంత హాయిని… మరిచిపోదు మనసు
ఒదిగి ఉండి నీ వాకిటిలో… బదులు కోరి నే నిలుచున్నా
దారి తెలియని చీకటిలో… వెలుగు చూసి కాదంటానా
ఊరించే… ఇది ఏ మాసం
ప్రేమించే ప్రతి గుండెను అందెల సందడి చేసే హేమంతం ఇది
మన సొంతం అయినది
కిలకిల నవ్వే కోయిల కోసం… వచ్చింది మధుమాసం
మిలమిల మెరిసే చంద్రుడి కోసం… తెర తీసెను సాయంత్రం
పని నిస సని నిప పమ మగ గససగ మాగ మాగ గా
పని నిస సని నిప పమ మగ గససగ మాగ మాప
మావి తోట మగ పెళ్లి వారికి… విడిది అంది చిలక
మనువు ముందరే మంతనాలకి… కదిలే గోరువంక
జాబిలమ్మని జాజులతో… తరలి రమ్మని అందామా
పేద మనసుకి పెళ్లంటే… అతిధులెవ్వరు రారమ్మ
నీ కన్నా సిరులా మిన్నా
ఓ మైనా మన మనువు మెచ్చిన మనసులు పెట్టిన సుముహూర్తం ఇది
వధువై రానా మరి..??
కిలకిల నవ్వే కోయిల కోసం… వచ్చింది మధుమాసం
మిలమిల మెరిసే చంద్రుడి కోసం… తెర తీసెను సాయంత్రం
జోలగా లాలించగా నీ నీడ దొరికింది
కమ్మగా కలలియ్యగా నీ తోడు నాకుంది
ఎద విల్లును వంచిన వాడే నీ రాముడు అన్నది మనసే
గుడి తలుపులు తియ్యక ముందే వరమిచ్చెను దేవత ఎదురై
నీదే ఆ చెలి… నిజమేనా జాబిలీ, ఆ ఆఆ ఆఆ