Menu Close

Keeravani Ragamlo Song Lyrics In Telugu – Swayamvaram

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Keeravani Ragamlo Song Lyrics In Telugu – Swayamvaram

కీరవాణి రాగంలో… పిలిచిందొక హృదయం
కొత్త కొత్త ఊహలతో… వణికిందొక అధరం
గాలిలోన తేలిపోవు… రాజహంసవు నీవంటా
నిన్ను తాకి పొంగిపోవు… నీలి మబ్బుని నేనంటా
వానలా వచ్చి వరదలా… పొంగు ప్రేమవే నీవా
మెరుపులా మైమరపులా… జత చేరగా రావా

కీరవాణి రాగంలో… పిలిచిందొక హృదయం
కొత్త కొత్త ఊహలతో… వణికిందొక అధరం

మంచు వెన్నెల స్నానమాడిన మల్లె పందిరిలో
వలపు వాకిట వేచి నిలిచిన వయసు పల్లకిలో
ఏకాంత సేవకు ఉర్రూతలూగిన శృంగార శిల్పానివా
కళ్యాణ రాముని కౌగిట్లో ఒదిగిన బంగారు పుష్పానివా
పంచుకో ప్రియతమా ప్రేమనే ప్రేమగా
తీయగా తీయ తీయగా తమకానివై ప్రేమా

కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం
కొత్త కొత్త ఊహలతో వణికిందొక అధరం

కదనసీమకు కాలు దువ్విన గడుసు మన్మధుడా
కౌగిలింతల కాటువేయకు చిలిపి చందురుడా
వేవేల సొగసులు వెచ్చంగ పొదిగిన వయ్యారి ముందుండగా
మందార పెదవుల గంధాలు తీయక అయ్యారే ఉండేదెలా
అందుకో అధరమే హాయిగా ఏకమై
ఘాటుగా అలవాటుగా తెరచాటుగా భామా

కీరవాణి రాగంలో… పిలిచిందొక హృదయం
కొత్త కొత్త ఊహలతో… వణికిందొక అధరం
గాలిలోన తేలిపోవు… రాజహంసవు నీవంటా
నిన్ను తాకి పొంగిపోవు… నీలి మబ్బుని నేనంటా
వానలా వచ్చి వరదలా పొంగు… ప్రేమవే నీవా
మెరుపులా మైమరపులా… జత చేరగా రావా

కీరవాణి రాగంలో… పిలిచిందొక హృదయం
కొత్త కొత్త ఊహలతో… వణికిందొక అధరం

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading