Menu Close

Keeravani Lyrics in Telugu – Anveshana


Keeravani Lyrics in Telugu – Anveshana

సా…నిసరిసాని…సా నిసమగామరి
పదసా..నిసరీసాని…
సా..నిసమగామరి
పదసససని రిరిరిస గగగరి
మమమగ పా…
సా ని ద ప మ గ రి స ని..

కీరవాణి…చిలకలా హొలికెరు పాడవేమే
వలపులే తెలుపగా విరబూసిన ఆశలు
విరితేనెలు చల్లగ అలరులు కురిసిన
ఋతువుల తడిసిన మధురసవాణి
కీరవాణి…..           
చిలకలాహొలికెరు పాడవేమే
వలపులే తెలుపగా….

గరిస పమగ పాని సరిగ రిగస నీద..
ఈ పూలలో అందమై ఈ గాలిలో గంధమై
నా తోటలో చైత్రమై ఈ బాటనే నడచిరా
నీ గగనాలలో నే చిరుతారనై
నీ అధరాలలో నే చిరునవ్వునై
స్వరమే లయగా ముగిసే..
సలలిత కలరుత స్వరనుత గతియుత
గమకము తెలియకనే….
కీరవాణి చిలకలా కలకలా పాడలేదు
వలపులే తెలుపగా
ఇలరాలిన పూవులు వెదజల్లిన తావుల
అలికిడి ఎరుగని పిలుపుల
అలిగిన మంజులవాణి      
కీరవాణి…..  చిలకలా కలకలా పాడలేదు
వలపులే తెలుపగా…..


నీ కన్నులా నీలమై నీ నవ్వులా వెన్నెలై
సంపెంగలా గాలినై తారాడనా నీడనై
నీ కవనాలలో నే తొలి ప్రాసనై
నీ జవనాలలో జాజుల వాసనై
ఎదలో ఎదలే కదిలే
పడచుల మనసుల పంజర శుకముల
పలుకులు తెలియకనే    
కీరవాణి చిలకలా కలకలా పాడలేదు
వలపులే తెలుపగా
విరితేనెలు చల్లగ అలరులు కురిసిన
ఋతువుల తడిసిన మధురసవాణి
కీరవాణి…..           
చిలకలాహొలికెరు పాడవేమే
వలపులే తెలుపగా….

Special Offer: కరెంట్ పోయినప్పుడు దాదాపు 4 గంటలు ఆన్లో వుండే బల్బ్ - Buy Now

Keeravani Lyrics in Telugu – Anveshana

Like and Share
+1
0
+1
0
+1
0
Posted in Lyrics in Telugu - Movie Songs

Subscribe for latest updates

Loading