Karakuraathi Gundello Lyrics in Telugu – Rajanna
కరకురాతి గుండెల్లో రగులుకున్న మంటల్లో
కాళీ మసైపోయెనమ్మ నీ గూడు
కడుపున్న కనకున్న కంటికి రెప్పల్లె
కాచుకున్న వాడిప్పుడు లేడు
రాబందుల రాజ్యంలో
రాకాసుల మూకల్లో
ఎలా ఎలా ఈడ బతకగలవమ్మా
ఎగిరిపోవే ఎడికైనా కోయిలమ్మ
ఎలా ఎలా ఈడ బతకగలవమ్మా
ఎగిరిపోవే ఎడికైనా కోయిలమ్మ
గుండెల్లో పెనవేసుకున్న అనుబంధాలు
ఆకలినే మరిపించే ఆటపాటలు
మరచిపోయి తీరాలమ్మ
నువ్వు మరచిపోయి తీరాలమ్మ
చెయ్యాలని మనసున్న చేతకాని వాళ్ళము
పెట్టాలని ఉన్న నిరుపేద వాళ్ళం
ఈ మట్టి లోన ఏకమైనా మీ అమ్మ నాన్నల
చల్లని దీవెనలే నీకు శ్రీ రామ రక్షగా
ఎగిరిపోవే యడికైనా కోయిలమ్మ
మన వాడికి మరి రాకమ్మా మల్లమ్మ
Karakuraathi Gundello Lyrics in Telugu – Rajanna
Like and Share
+1
+1
+1