Menu Close

Kanya Kumari Lyrics in Telugu – Bobbili Raja


Kanya Kumari Lyrics in Telugu – Bobbili Raja

ఊఊ ఊఉ ఊఊ ఊఉ
చంచక్ చంచక్ చం చ చం చం చం చక్ చంచం
చంచక్ చంచక్ చం చ చం చం చం చక్ చంచం
బిం ఆ బిం బిం ఆ బిం బిం ఆ బిం బిం ఆ బిం బిం
ఆ బిం బిం ఆ బిం బిం ఆ బిం బిం

కన్యాకుమారి కనబడదా దారి
కయ్యాలమారి పడతావే జారి
పాతాళం కనిపెట్టేలా… ఆకాశం పనిపట్టేలా
ఊగకే మరి… మతిలేని సుందరి
జింగ్ చక్ జింగ్ చక్ చాం
చకు జింగ్ చక్ జింగ్ చక్ చాం

గోపాల బాలా ఆపర ఈ గోల
ఈ కైపు ఏలా… ఊపర ఉయ్యాల
మైకంలో మయసభ చూడు
మహరాజా రానా తోడు
సాగనీమరి సరదాల గారడీ
జింగ్ చక్ జింగ్ చక్ చాం
చకు జింగ్ చక్ జింగ్ చక్ చాం

కొండలూ గుట్టలూ… చిందులాడే తధిగినతోం
వాగులూ వంకలూ… ఆగి చూసే కథ చెబుదాం
తూనీగ రెక్కలెక్కుదాం… సూరీడి పక్క నక్కుదాం
కుందేటి కొమ్ము వెతుకుదాం… బంగారు జింకనడుగుదాం

చూడమ్మా హంగామా…!!
అడివంతా రంగేద్దాం… సాగించే వైరైటీ ప్రోగ్రాం
కళ్ళవిందుగా పైత్యాల పండగ, హ హా
జింగ్ చక్ జింగ్ చక్ చాం
చకు జింగ్ చక్ జింగ్ చక్ చాం

కన్యాకుమారి కనబడదా దారి
కయ్యాలమారి పడతావే జారి
మైకంలో మయసభ చూడు
మహరాజా రానా తోడు
సాగనీమరి సరదాల గారడీ
జింగ్ చక్ జింగ్ చక్ చాం
చకు జింగ్ చక్ జింగ్ చక్ చాం

డేగతో ఈగలే… ఫైటు చేసే చెడుగుడులో
చేపలే చెట్టుపై… పళ్ళు కోసే గడబిడలో
నేలమ్మా తప్పతాగెనో… ఏ మూలా తప్పిపోయెనో
మేఘాల కొంగు పట్టుకో… తూలేటి నడకనాపుకో
ఓయమ్మో మాయమ్మో..!!

దిక్కుల్నే ఆటాడించే… చిక్కుల్లో గందరగోళం
ఒళ్ళు ఊగగా… ఎక్కిళ్ళు రేగగా
జింగ్ చక్ జింగ్ చక్ చాం
చకు జింగ్ చక్ జింగ్ చక్ చాం

ఏయ్..! గోపాలబాలా… ఓయ్, ఆపర ఈ గోల
ఈ కైపు ఏలా… హహ్హహా, ఊపర ఉయ్యాల
హా, పాతాళం కనిపెట్టేలా… ఆకాశం పనిపట్టేలా
ఊగకే మరి మతిలేని సుందరి, మ్మ్

జింగ్ చక్ జింగ్ చక్ చాం
చకు జింగ్ చక్ జింగ్ చక్ చాం
సాగనీమరి సరదాల గారడీ
జింగ్ చక్ జింగ్ చక్ చాం
చకు జింగ్ చక్ జింగ్ చక్ చాం

Kanya Kumari Lyrics in Telugu – Bobbili Raja

Like and Share
+1
0
+1
0
+1
0
Posted in Lyrics in Telugu - Movie Songs

Subscribe for latest updates

Loading