Menu Close

Kanulanu Kalipina Song Lyrics In Telugu – Marakkar

Kanulanu Kalipina Song Lyrics In Telugu – Marakkar

కృష్ణ నీ చిలిపి రాధా
రాధ నీ రాగానిదే
నిన్నే మనమున విరిసే
పూలతో పూజ చేసే

సగరిగ మనినిస నిసగరిసనిదమ గమపగరిస
ససగగ ససమమ ససగగరిరిగ మమనిస
నినిసస గనిసస నినిసస గనిసస
నినిసస నినిదదప…

కనులను కలిపిన కలవై
ఈ యమునను ఎగసిన అలవై
జతలో పలికిన జతివై
సరగుణా రావే… నా ఎద శృతివై

సరిగమ పలికిన స్వరమై
తొలివలపులు చిలికిన వరమై
పెదవులు దాటని పదమై
చిలికిన రారా… నా ప్రియలయవై

తియ్యని ఊహే ఉయ్యాలలూగే
నీ చూపు మాయే… ఈ స్నేహమాయే
మేఘాలతోటే రాగాలు మీటే
సల్లాపమంతా సంగీతమాయే

కనులను కలిపిన కలవై
ఈ యమునను ఎగసిన అలవై
జతలో పలికిన జతివై
సరగుణా రావే నా ఎద శృతివై

మింటి చుక్క దీపం… నీ కంటిలోన వెలిగే
జంటలేని తాపం నేడు… ఒంటిలోన కలిగే
పెదవి మధువు సోకి… వెదురే వేణువల్లే మారే
మధన మధన రేఖ… నిదురే రేణువల్లే జారే

రసవేదం మనసిచరాగం
మధువాదాం మధికనువాదాం
సరసాల సొరసాల
అది వనచర సాన కదా
అలివేణి కనవాని
ఈ సంగీత సాహిత్య సంగమమే

సరిగమ పలికిన స్వరమై
తొలివలపులు చిలికిన వరమై
పెదవులు దాటని పదమై
చిలికిన రారా… నా ప్రియలయవై

స్వప్న కన్య నాకు నేడు… స్వర్గమల్లే తోచే
మోజులన్ని తీరు… ఎదలో జాజిమల్లె పూచే
ఆరు ఋతువులందు… నీకై ఆమనల్లే వేచా
మీదు పదము సోకా మాటలు… మనసు విరిని పరిచా

రాసలీలా బృందావనాన
హో ఓ, అందాలందే నందవనాన
వరవీణా మృదుపాణి
నీ స్వరజతి నా గతిగా
ఈ వీణ నెరజాణా
ఈ రెండు నీకింకా అంకితమే

కనులను కలిపిన కలవై
ఈ యమునను ఎగసిన అలవై
జతలో పలికిన జతివై
సరగుణా రావే నా ఎద శృతివై

Like and Share
+1
8
+1
5
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading