Menu Close

Kannullo Kalalunte Song Lyrics in Telugu – Idhe Maa Katha


ఓ ఓ, కన్నుల్లో కలలుంటే వెతికేద్దాం
ఓ, నిన్నల్లో కలతల్నే వదిలేద్దాం
నువ్వెవ్వరో నేనెవ్వరో… స్నేహాన్నిలా ముడేద్దాం
నవ్వేందుకే పుట్టామని… ప్రపంచమే చాటేద్దాం

కన్నుల్లో కలలుంటే వెతికేద్దాం
ఓ, నిన్నల్లో కలతల్నే వదిలేద్దాం

ఓ వ్, నీతో నువ్వుంటే… మనసునైనా మరచిపోవా
నీలో ప్రేముంటే… నిను నువ్వే వదులుకోవా
కధ నడవదు ఎపుడూ… నువ్వనుకొను దారిలో
చిరు అలజడి ఉండదా… ఈ బ్రతుకను తీరులో

కన్నుల్లో కలలుంటే వెతికేద్దాం, ఓ ఓఓ
నిన్నల్లో కలతల్నే వదిలేద్దాం, ఓ

లైఫే ఒక వింత… ఉరకలేద్దాం బ్రతికి చూద్దాం
లోకం మనసెంతో అడిగి చూద్దాం, కలిసిపోదాం
ప్రతిచోటొక గమ్యం… ఎవరెవరికో సొంతం
మన గెలుపుకు సూత్రం… ఇక మరువకు నేస్తం

Like and Share
+1
0
+1
0
+1
0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading