Menu Close

Kannula Logililo Song Lyrics In Telugu – Raja


Kannula Logililo Song Lyrics In Telugu – Raja

ఆ ఆఆ ఆఆ… లాల్లలలాల్లల లా లాల్లలలాల్లల లా
కన్నుల లోగిలిలో… వెన్నెల విరిసింది
చల్లని జాబిలితో… స్నేహం కుదిరింది
చెలిమి తోడుంటే చాలమ్మా… లేనిది ఏముంది
ఆశ చిటికేస్తే చాలమ్మా… అందనిదేముందీ
కన్నుల లోగిలిలో… వెన్నెల విరిసింది
చల్లని జాబిలితో… స్నేహం కుదిరింది

గున్నమామి గొంతులో తేనెతీపి నింపుతూ
కోయిలమ్మ చేరుకున్నది
ఎండమావి దారిలో పంచదార వాగులా
కొత్తపాట సాగుతున్నది
ఒంటరైన గుండెల్లో ఆనందాల అందెలతో
ఆడే సందడిది
అల్లిబిల్లి కాంతులతో ఏకాంతాల చీకటిని
తరిమే బంధమిది

కల చెరగని కలలను చూడు… కంటికి కావలి నేనుంటా
కల తరగని వెలుగులు నేడు… ఇంటికి తోరణమనుకుంటా
కన్నుల లోగిలిలో… వెన్నెల విరిసింది
చల్లని జాబిలితో… స్నేహం కుదిరింది

పంచుకున్న ఊసులూ పెంచుకున్న ఆశలూ
తుళ్లితుళ్లి ఆడుతున్నవి
కంచెలేని ఊహలే పంచవన్నె గువ్వలై
నింగి అంచు తాకుతున్నవి
కొత్తజల్లు కురిసింది బ్రతుకే చిగురు తొడిగేలా
వరమై ఈ వేళ
వానవిల్లు విరిసింది మిన్ను మన్ను కలిసేలా
ఎగసే ఈ వేళ

అణువణువును తడిపిన ఈ తడి… అమృతవర్షిణి అనుకోనా
అడుగడుగున పచ్చని బాటను… పరిచిన వనమును చూస్తున్నా
కన్నుల లోగిలిలో… వెన్నెల విరిసింది
చల్లని జాబిలితో… స్నేహం కుదిరింది
చెలిమి తోడుంటే చాలమ్మా… లేనిది ఏముంది
ఆశ చిటికేస్తే చాలమ్మా… అందనిదేముంది

Like and Share
+1
0
+1
0
+1
0
Share with your friends & family
Posted in Lyrics in Telugu - Movie Songs
Loading poll ...

Subscribe for latest updates

Loading