ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
గుముసుము గుముసుము గుప్పుచ్చుక్… గుముసుము గుపుచ్చ్
గుముసుము గుముసుము గుప్పుచ్చుక్… గుముసుము గుపుచ్చ్
సల సల సల సక్కల్లాడె జోడి వేటాడే
విల విల విల విల వెన్నెలలాడి… మనసులు మాటాడి
మామా కొడుకు రాతిరికొస్తే… వదలకు రేచుక్కొ
మంచం చెప్పిన సంగతులన్నీ… మరువకు ఏంచక్కో
మామా కొడుకు రాతిరికొస్తే… వదలకు రేచుక్కొ
మంచం చెప్పిన సంగతులన్నీ… మరువకు ఏంచక్కో
కన్నానులే కలయికలు… ఏనాడు ఆగవులే
నీ కళ్ళలో పలికినవి… నా కంటి బాసలివే
అందాల వయసేదో తెలితామరై… విరబూసె వలపేదో నాలో
నీ పేరు నా పేరు తెలుసా మరీ… హృదయాల కధ మారే నీలో
వలపందుకే కలిపేనులే… ఒడి చేరే వయసెన్నడో
కన్నానులే కలయికలు… ఏనాడు ఆగవులే
నీ కళ్ళలో పలికినవి… నా కంటి బాసలివే
అందాల వయసేదో తెలితామరై… విరబూసె వలపేదో నాలో
నీ పేరు నా పేరు తెలుసా మరీ… హృదయాల కధ మారే నీలో
వలపందుకే కలిపేనులే… ఒడి చేరే వయసెన్నడో
ఉరికే కసి వయసుకు శాంతం శాంతం… తగిలితే తడబడే అందం
జారే జలతారు పరదా కొంచెం కొంచెం… ప్రియమగు ప్రాయాల కోసం
అందం తొలి కెరటం… చిత్తం తొణికిసలై నీటి మెరుపాయె
చిత్తం చిరుదీపం… రెప రెప రూపం తుళ్ళి పడసాగె
పసి చినుకే ఇగురు సుమా… మూగి రేగే దావాగ్ని పుడితే
మూగే నా గుండెలో నీలిమంట…
కన్నానులే కలయికలు… ఏనాడు ఆగవులే
నీ కళ్ళలో పలికినవి… నా కంటి బాసలివే
అందాల వయసేదో తెలితామరై… విరబూసె వలపేదో నాలో
నీ పేరు నా పేరు తెలుసా మరీ… హృదయాల కధ మారే నీలో
వలపందుకే కలిపేనులే… ఒడి చేరే వయసెన్నడో
గుముసుము గుముసుము గుప్పుచ్చుక్… గుముసుము గుపుచ్చ్
గుముసుము గుముసుము గుప్పుచ్చుక్… గుముసుము గుపుచ్చ్
సల సలసల సక్కల్లాడె జోడి వేటాడే
విల విల విల విల వెన్నెలలాడి… మనసులు మాటాడి
మామా కొడుకు రాతిరికొస్తే… వదలకు రేచుక్కొ
మంచం చెప్పిన సంగతులన్నీ… మరువకు ఏంచక్కో
మామా కొడుకు రాతిరికొస్తే… వదలకు రేచుక్కొ
మంచం చెప్పిన సంగతులన్నీ… మరువకు ఏంచక్కో
శ్రుతి మించేటి పరువపు వేగం వేగం… ఉయ్యాలలూగింది నీలో
తొలి పొంగుల్లొ దాగిన తాపం తాపం… సయ్యాటలాడింది నాలో
ఎంత మైమరపో… ఇన్ని ఊహల్లో తెల్లారే రేయల్లే
ఎడబాటనుకో ఎర్రమల్లెలో తేనీరు కన్నీరే…
ఇది నిజమా కల నిజమా… గిల్లుకున్న జన్మనడిగా
నీ నమాజుల్లో ఓనమాలు మరిచా…

కన్నానులే…