ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
ఆషాడ మాసంలో అమ్మోరి జాతరలంటా
ప్రతి ఇంటా బోనం బొట్టు… తలపై మెరిసేనంటా
అమ్మలగన్న అమ్మ… గోల్కొండ ఎల్లమ్మ
మా పిల్లా పాపాలను సల్లగ సూడే అమ్మ మాయమ్మో
అమ్మలకే పెద్దమ్మ… జూబ్లీ హిల్స్ పెద్దమ్మ
మా దిక్కుమొక్కు నీవేనమ్మా దీవించరావమ్మా
భక్తితోటి నిన్నే కొలిసి… బొట్లా బోనం చేత్తామే
కొత్తా కుండలో అన్నం వండి… నైవేధ్యాలు పెట్టేమే
ఏడాదికోసారి నీ పండగొస్తే
ఊరువాడా చిన్నా పెద్దా సిందులేసేనే
బాయిలోన వెలిసావే బాల్కంపేట ఎల్లమ్మా
మా బాధలు తీర్చి… బతుకులు మార్చగ రావే ఎల్లమ్మ
ఒక్కపొద్దులుండి దిక్కు నువ్వేనని
మొక్కుతు ఉన్నామే… మమ్ము దీవించగ రారాదే
ఈ కష్టకాలాన కన్నీళ్ళనీ తూడ్చి
కరుణించి కాపాడవే… తోడు నీడై నడిపించవే
ఏ చోట చూసిన… ఏ నోట విన్నా
బంధాలు భారమాయే… అనుబంధాలు దూరమాయే
పసిబిడ్డకే తల్లి పాలివ్వలేనట్టి
గడ్డు కాలమొచ్చెనే… మాకు గుండెకోత పెట్టెనే
లోకాలనేలేటి మా తల్లి మాంకాళి
ఈ మాయ రోగాన్ని తరిమెయ్యవే
తరిమెయ్యవే తరిమెయ్యవే
చిరునవ్వు సిందేలా సిరులెన్నో కురిసేలా
వరములు మా ఇంట కురిపించవే
కురిపించవే మమ్ము మురిపించవే
బాయిలోన వెలిసావే బాల్కంపేట ఎల్లమ్మా
మా బాధలు తీర్చి… బతుకులు మార్చగ రావే ఎల్లమ్మ
పుట్టలో పుట్టిన తల్లివి నువ్వని
పూజలే చేస్తుంటమే… పొర్లు దండాలు పెడుతుంటమే
మా పెద్దపులులెక్కి లోకమంతా తిరిగి
మమ్మేలుతుంటావే మా అండదండా నీవే
పోతురాజులంత నీ ముందు నిలబడి
రంగమాడుతుంటరే ఆడిబిడ్డ అని కొలుతురే
లాలుదర్వాజ లష్కర్ బోనాల సంబరాలు చేత్తమే
అంగరంగ వైభవంగా చేత్తమే
మేకపోతులతో శివసత్తుల
సిందులహో సిందులహో సిందులహో
డప్పుల సప్పుల్ల జమిడికే మోతల్లో
ఆషాడ మాసాన జాతరహో జాతరహో, జాతరహో
అమ్మలగన్న అమ్మా… గోల్కొండ ఎల్లమ్మ
మా పిల్లా పాపాలను సల్లగ సూడే అమ్మ మాయమ్మో
అమ్మలగన్న అమ్మా… గోల్కొండ ఎల్లమ్మ
మా పిల్లా పాపాలను సల్లగ సూడే అమ్మ మాయమ్మో
మా పిల్లా పాపాలను సల్లగ సూడే అమ్మ మాయమ్మో