Menu Close

Kalisunte Kaladu Sukham Song Lyrics In Telugu – Kalisundham Raa

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Kalisunte Kaladu Sukham Song Lyrics In Telugu – Kalisundham Raa

ధీంతన ధీంతన దిననననా
దినన దినననానా
ధీంతన ధీంతన దిననననా
దినన దినననానా

కలిసుంటే కలదు సుఖం… కమ్మని సంసారం
అవుతుంటే కలలు నిజం… ప్రేమకు పేరంటం
గుమ్మడి పువ్వుల నవ్వులతో… గుమ్మమెదురు చూసే
కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంధ్రదనసు విరిసే
వస్తారా మా ఇంటికి ప్రతిరోజూ సంక్రాంతికీ
గుమ్మడి పువ్వుల నవ్వులతో… గుమ్మమెదురు చూసే
కుంకుమ పువ్వుల మిలమిలతో… ఇంధ్రదనసు విరిసే

ఖుషితోటలో గులాబీలు పూయిస్తుంటే… హలో ఆమని చెలో ప్రేమని
వసంతాలు ఇలా ప్రతిరోజూ వస్తూ ఉంటే… చలి కేకలా చెలే కోకిలా
నవ్వులనే పువ్వులతో నిండిన ప్రేమవనం
వెన్నెలలే వెల్లువలై పొంగెను సంతోషం
ప్రేమలన్ని ఒకసారే పెనేసాయీ మా ఇంట
గుమ్మడి పువ్వుల నవ్వులతో… గుమ్మమెదురు చూసే
కుంకుమ పువ్వుల మిలమిలతో… ఇంధ్రదనసు విరిసే
కలిసుంటే కలదు సుఖం… కమ్మని సంసారం
అవుతుంటే కలలు నిజం… ప్రేమకు పేరంటం

ఒకే ఈడుగా ఎదే జోడుకడుతూ ఉంటె… అదే ముచ్చట కధే ముద్దటా
తరం మారినా స్వరం మారనీ ప్రేమ… సరాగానికే వరం అయినదీ
పాటలకే అందనిది పడుచుల పల్లవిలే…
చాటులలొ మాటులలో సాగిన అల్లరిలే
పాల పొంగు కోపాలో పైట చెంగు తాపాలో
గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మమెదురు చూసే
కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంధ్రదనసు విరిసే

కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం
అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం
గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మమెదురు చూసే
కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంధ్రదనసు విరిసే
వస్తారా మా ఇంటికి ప్రతిరోజూ సంక్రాంతికీ

ధీంతన ధీంతన దిననననా
దినన దినననానా
ధీంతన ధీంతన దిననననా
దినన దినననానా

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading