Menu Close

Kaliki Chilaka Chaliki Dariki Lyrics In Telugu – Jwala

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Kaliki Chilaka Chaliki Dariki Lyrics In Telugu – Jwala

కలికి చిలక చలికి దరికి చేరగనే
చినుకులిగిరి వలపు రగిలి కోరగనే
జాణ మేన వాన వీణ ఝల్లుమన్నది
ప్రేమ గాలి సోకి నన్ను అల్లుకున్నది
జాణ మేన వాన వీణ ఝల్లుమన్నది
ప్రేమ గాలి సోకి నన్ను అల్లుకున్నది
కౌగిలింతలోనే… హేయ్ హెయ్

కలికి చిలక చలికి దరికి చేరగనే
చినుకులిగిరి వలపు రగిలి కోరగనే

వానొచ్చి తడిసాక
వయసెంతో తెలిసింది తొలిసారిగా
నీవొచ్చి కలిశాక
మనసంటే తెలిసింది ఒక లీలగా

ఆ గాలి వానల్లె కలిశాము
ఎద మంటల్లో… చలి గుళ్ళో చేరాము
మెరుపల్లె ఉరుమల్లె కలిశాము
తొలి వయసుల్లో… వడగళ్ళే ఏరాము

మనం మనం… మనం మనం వరించడం
తరించడం ఇహం పరం
క్షణం క్షణం నిరీక్షణం… సుఖం సుఖం, లలాల్ల

కలికి చిలక చలికి దరికి చేరగనే
వయసు తడిసి వలపు రగిలి కోరగనే
మెరుపు తీగలాంటి మేను మెలికపడ్డది
ఉరుముతున్న నిన్ను చూసి ఉలికిపడ్డది
మెరుపు తీగలాంటి మేను మెలికపడ్డది
ఉరుముతున్న నిన్ను చూసి ఉలికిపడ్డది
కౌగిలింతలోనే… హే హె

కలికి చిలక చలికి దరికి చేరగనే
వయసు తడిసి వలపు రగిలి కోరగనే

వాటేసుకుంటేనే వయసొచ్చే
ఈ సందే సందిళ్ళలో, హో
వయ్యారి అందాలు
వరదల్లె పొంగేటి కౌగిళ్ళలో, హ

సూరీడు వెళ్ళాక సాయంత్రం
తొలి నా ఈడు కోరింది నీ మంత్రం
చుక్కల్తో వచ్చింది ఆకాశం
చలి చూపుల్లో తెచ్చింది ఆవేశం

ప్రియం ప్రియం… ఊఊఉ
ప్రియం ప్రియం జతిస్వరం
పరస్పరం స్వయంవరం
నరం నరం ఒకే స్వరం నిరంతరం

తరార, కలికి చిలక చలికి దరికి చేరగనే
చినుకులిగిరి వలపు రగిలి కోరగనే
జాణ మేన వాన వీణ ఝల్లుమన్నది
ప్రేమ గాలి సోకి నన్ను అల్లుకున్నది

మెరుపు తీగలాంటి మేను మెలికపడ్డది
ఉరుముతున్న నిన్ను చూసి ఉలికిపడ్డది
కౌగిలింతలోనే… హే హేయ్
కలికి చిలక చలికి దరికి చేరగనే
వయసు తడిసి వలపు రగిలి కోరగనే

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading