Menu Close

Kalale Kannane Lyrics In Telugu – Degala Babji

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Kalale Kannane Lyrics In Telugu – Degala Babji

కలలే కన్నానే… కలగా మిగిలేనే
కథగా మారిందే
ఎదలోని వ్యధలే నను లోకువ చేసి
దోబూచులాడిందే

రారు నీతో ఎవరు
చివరికి మిగిలే నీడే నీవు
విధిరాతలే విలపించిన
కడలల్లే ఎగసిపడు

కాలే కడుపే కనువిప్పు చేస్తుంటే
కడలై మొదలై రగిలయ్
మండే నిప్పే సెగలై భగభగమని
ఉరుమై మెరుపై ముందుకు పదరా

ఏదో మనసును తరుముతున్న తీరే నీదా
కాదా చంద్రుడు చిన్నబోయే అందం నీదే

గుండె గూటిలోన నిన్ను దాచుకోనా
జ్ఞాపకాల పాట కాదిది
మరువలేక నిన్ను మసకబారి కన్ను
బతుకు వెతుకులాడుతున్నదీ
లోకాతీరులోనే గతిని మార్చి నీవు
దీపమార్పి ధూపమైతివి

కాలే కడుపే కనువిప్పు చేస్తుంటే
కడలై మొదలై రగిలయ్
మండే నిప్పే సెగలై భగభగమని
ఉరుమై మెరుపై ముందుకు పదరా

లోకం తీరుకు మనిషి బతుకు శాపం శోఖం
మోసం బలమని తలచుకోకు బతుకే శూన్యం

బతకనేర్చినోడు బతకలేనినాడు
అడ్డదారి వెతుకుతాడురా
బలహీనుడేమో గుండె గుటకలేస్తూ
నీతిలోన నిక్కుతాడులే

మంచి గురిని చూస్తూ
మనసు గెలుచుకుంటూ
నిజములోనే నడుచుకో ఇక

కాలే కడుపే కనువిప్పు చేస్తుంటే
కడలై మొదలై రగిలయ్
మండే నిప్పే సెగలై భగభగమని
ఉరుమై మెరుపై ముందుకు పదరా

Kalale Kannane Lyrics In Telugu – Degala Babji

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading