Menu Close

Kalalai Poyenu Lyrics In Telugu-Sakhi

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

ప్రేమలే నేరమా… ప్రియా ప్రియా
వలపు విరహమా… ఓ నా ప్రియా
మనసూ మమతా ఆకాశమా
ఒక తారై మెరిసిన నీవెక్కడో

కలలై పోయెను నా ప్రేమలూ
అలలై పొంగెను నా కన్నులూ
కలలై పోయెను నా ప్రేమలూ
అలలై పొంగెను నా కన్నులూ
మదితే అథిదిగ రానేలనొ
శెలవైనా అడగక పోనేలనొ
ఎదురు చూపుకూ నిదరేదీ
ఊగెను ముసురే కన్నీరై
మనసు అడిగినా మనిషెక్కడో
నా పిలుపే అందని దూరాలలో
కలలై పోయెను నా ప్రేమలూ
అలలై పొంగెను నా కన్నులూ

అనురాగానికి స్వరమేదీ… సాగర ఘోషకు పెదవేదీ
అనురాగానికి స్వరమేదీ… సాగర ఘోషకు పెదవేదీ
ఎవరికి వారే ఎదురుపడీ… ఎదలు రగులు ఎడబాటులలో
చివరికి దారే మెలికపడి… నిను చేరగ నేనే శిలనైతినీ
ఎండమావిలో నావను నే ఈ నిట్టూర్పే నా తెరచాపలే
కలలై పోయెను నా ప్రేమలూ… అలలై పొంగెను నా కన్నులూ

వెన్నెల మండిన వేధనలో… కలువ పువ్వులా కలతపడీ
వెన్నెల మండిన వేధనలో… కలువ పువ్వులా కలతపడీ
చేసిన బాసలు కలలైపోతే… బతుకే మాయగ మిగులుననీ
నీకై వెతికా కౌగిళినై… నీడగ మారిన వలపులతో
కలిసి ఉన్నాను ఆశలతో… నను ఓదార్చే నీ పిలుపెన్నడో
కలలై పోయెను నా ప్రేమలూ… అలలై పొంగెను నా కన్నులూ
కలలై పోయెను నా ప్రేమలూ… అలలై పొంగెను నా కన్నులూ

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading