అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
Kalaganti Kalaganti Lyrics In Telugu – Annamayya
కలగంటి కలగంటి
ఇప్పుడిటు కలగంటి
ఎల్లలోకములకు అప్పడగు తీరు వెంకటాద్రీశుగంటి
కలగంటి కలగంటి
ఇప్పుడిటు కలగంటి
ఎల్లలోకములకు అప్పడగు తీరు వెంకటాద్రీశుగంటి
ఇప్పుడిటు కలగంటి
అతిశయంబైన శేషాద్రి శిఖరముగంటి
ప్రతిలేని గోపుర ప్రభలుగంటి
శతకోటి సూర్యతేజములు వెలుగగంటి
చతురాస్యు పొడగంటి చతురాస్యు పొడగంటి
చయ్యన మేలుకొంటి
ఇప్పుడిటు కలగంటి
అరుదైన శంఖచక్రాదు లిరుగాడగంటి
సరిలేని అభయ హస్తమునుకంటి
తీరు వెంకటాచలాధిపుని చూడగగంటి
హరిగంటి గురుగంటి
హరిగంటి గురుగంటి
అంతటా మేలుకంటి
కలగంటి కలగంటి
ఇప్పుడిటు కలగంటి
ఎల్లలోకములకు అప్పడగు తీరు వెంకటాద్రీశుగంటి
ఇప్పుడిటు కలగంటి
ఇప్పుడిటు కలగంటి
Like and Share
+1
+1
+1