Kala Kalalu Kila Kilalu Song Lyrics In Telugu – Thammudu
కళకళలు కిలకిలలు… కొత్తగ చేరెను మా ఎదగూటికి
వెలుతురులు వెన్నెలలు… ఎదురుగ నిలిచెను మా కన్నులకి
రాముడికి జానకికి… పెళ్ళి కుదిరినది
ఈ సందడికి విందులకి… ఇల్లు మురిసినది గలగల
కళకళలు కిలకిలలు… కళకళలు కిలకిలలు
కొత్తగ చేరెను మా ఎదగూటికి
వెలుతురులు వెన్నెలలు… ఎదురుగ నిలిచెను మా కన్నులకి
రాముడికి జానకికి… పెళ్ళి కుదిరినది
ఈ సందడికి విందులకి… ఇల్లు మురిసినదీ… హొయ్
నమ్మలేని లోకం నుంచి… మహాలక్ష్మిలాగా
అమ్మలేని మా ఇంట్లోకి… వదినమ్మ రాకా
ఎన్నడైన తన వెనకాలే… ఉంటాను కనకా
అన్నగారు తననేమన్నా… ఊరుకోను ఇంకా
నా చిన్ని అల్లర్లన్నీ… భరించాలి అంతా ఓర్పుగా
కళకళలు కిలకిలలు… కొత్తగ చేరెను మా ఎదగూటికి
వెలుతురులు వెన్నెలలు… ఎదురుగ నిలిచెను మా కన్నులకి
మెట్టినింటి దీపం… నీతో వెలగాలి మళ్ళీ
కూతురంటి రూపం నీదే… నా చిట్టితల్లి
ఆశలన్నీ అక్షింతలుగా… జరగాలి పెళ్ళీ
అందమైన జంటను చూసి… మురవాలి తాళి
విడిది నేను ఇస్తానంటూ… తపించాలి నింగిన జాబిలి
కళకళలు కిలకిలలు… కొత్తగ చేరెను మా ఎదగూటికి
వెలుతురులు వెన్నెలలు… ఎదురుగ నిలిచెను మా కన్నులకి
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.