ఏ తల్లి కడుపు పంటవే బతుకమ్మ… జగమే కొలిసీ వడిసేనమ్మా
ఏ కలతలు ఎదురుపడక దీవించమ్మ… జీవితమంతా కొలిసెదమమ్మా
ప్రతి ఆడబిడ్డకిది పెద్ద పండుగా… ప్రకృతి ఇచ్చే గొప్ప వరమేనంటా
ప్రతియేటా వైభవంగా జరిగేనంటా… బతుకమ్మతో బంధం ముడిపడెనంటా
అరె డప్పులె ఏగాలి… ధరణే మురవాలి
ఊరే ఊగాలి ఇయ్యాలా…
సింగిడి ఊయాలే… వాకిలె మెరవాలే
పువ్వుల జాతరనే చెయ్యాలా…
తీరొక్క పువ్వుల తీర్థం ఈడా… కడదాము గౌరమ్మకు పువ్వుల మేడ
మా ఆడబిడ్డల పండుగ సూడా… దేవానా దేవుళ్ళే కొలువుదీరగా
డప్పులె ఏగాలి… ధరణే మురవాలి
ఊరే ఊగాలి ఇయ్యాలా…
సింగిడి ఊయాలే… వాకిలె మెరవాలే
పువ్వుల జాతరనే చెయ్యాలా…
అవ్వ అలికింది అందాల వాకిలి…
సెల్లె వెట్టింది ముత్యాల ముగ్గు మరి…
అయ్య తెచ్చిండు… ఓ బత్తెడు పువ్వులను
పేర్చుకుందాము తల్లీ బతుకమ్మను
శరణంటూ తల్లీ బొడ్డెమ్మను మొక్కాలే ముందుగా
శివలీలే గంగను గౌరమ్మను… కలిపేటి పండుగ
ఎత్తు ఏడెత్తుల బతుకమ్మను పేర్వరే
డప్పులె ఏగాలి… ధరణే మురవాలి
ఊరే ఊగాలి ఇయ్యాలా…
సింగిడి ఊయాలే… వాకిలె మెరవాలే
పువ్వుల జాతరనే చెయ్యాలా…
ఎదలోయల లేని ఏదో ఆనందమూ…
ఆడబిడ్డలకు బతుకమ్మతో బంధము…
ఏదో జన్మల చేసిన పుణ్యము…
అమ్మను కొలుసుకుంటే… ఈ జన్మే ధన్యము
ఏలేలో ఎంగిలి పువ్వులతో… మొదలయ్యే మోతరా
పల్లెల్లో పండుగ అంటేనే… బతుకమ్మ సూడరా
వంగి సప్పట్లతో ఉయ్యాలలూగారే
సల్లగ సూడే పువ్వుల తల్లి… మళ్ళా రావే యాడాదికి తిరిగి
అమ్మవు నువ్వే బతుకమ్మ తల్లి… బతుకులుగోరె బంగారు పల్లి
సల్లగ సూడే పువ్వుల తల్లి… మళ్ళా రావే యాడాదికి తిరిగి
అమ్మవు నువ్వే బతుకమ్మ తల్లి… బతుకులుగోరె బంగారు పల్లి