ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Jivvumani Kondagali Lyrics in Telugu – Lankeshwarudu
జివ్వుమని కొండ గాలి కత్తిలా గుచ్చుతోంది
వెచ్చని కోరిక రగిలిందిలే
నీవే నా ప్రేయసివే
నీకేలే అందుకో ప్రేమ గీతం
కస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతోంది
తీయని కానుక దొరికిందిలే
నీవే నా ప్రేమవులే
నీకేలే అందుకో ప్రేమ గీతం
జివ్వుమని కొండ గాలి కత్తిలా గుచ్చుతోంది
ఒంపుల్లో సొంపుల్లో అందముంది
కసి చూపుల్లో ఊపుల్లో పందెముంది
ఒంపుల్లో సొంపుల్లో అందముంది
కసి చూపుల్లో ఊపుల్లో పందెముంది
కాశ్మీర కొండల్లో అందాలకే కొత్త అందాలు ఇచ్చావో
కాశ్మీర వాగుల్లో పరుగులకే కొత్త అడుగులనే నేర్పావో
నేనే నిను కోరి చేరి వాలి పోవాలి
కస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతోంది
మంచల్లే కరగాలి మురిపాలు
సెలయేరల్లే ఉరకాలి యవ్వనాలు
మంచల్లే కరగాలి మురిపాలు
సెలయేరల్లే ఉరకాలి యవ్వనాలు
కొమ్మల్లో పూలన్నీ పానుపుగా మన ముందుంచే పూలగాలి
పువ్వుల్లో దాగున్న అందాలనే మన ముందుంచే గంధాలుగా
నేనే నిను కోరి చేరి వాలి పోవాలి
జివ్వుమని కొండ గాలి కత్తిలా గుచ్చుతోంది
కస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతోంది