ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Jajimogulali Lyrics In Telugu – జాజిమొగులాలి లిరిక్స్ – Rudrangi – 2023
ఏ వచ్చిందే వచ్చిందే
తయ్యారై వెన్నెల వయ్యారే
ఓ పోరి…
పుట్ట మీద పాల పిట్ట జాజిమొగులాలి
ముట్టబోతే తేలు కుట్టే జాజిమొగులాలి
పుట్ట మీద పాల పిట్ట జాజిమొగులాలి
ముట్టబోతే తేలు కుట్టే జాజిమొగులాలి
మంత్రమేసే మామ కొడుకా జాజిమొగులాలి
మందు దంచుకొని రారా జాజిమొగులాలి
పుట్ట మీద పాల పిట్ట జాజిమొగులాలి
ముట్టబోతే తేలు కుట్టే జాజిమొగులాలి
పేరు పెట్టి ప్రేమతోని పిలవనంటడే
వాడు ఇగురంగా ఇస్తారా చేస్తానంటడే
ఏలు పెట్టి నలుగుట్ల నడువనంటడే
వాడు ఏమి ఎరుగనట్టు
ఎన్ని వగలుపడతడే
ఒక్కదాన్ని దొరికితే వదులనంటడే
నన్ను బక్కపలుసాగున్నవంటు లెక్కలేస్తాడే
తిక్క తిక్క పనులెన్నో చెయ్యమంటడే
వాడు పక్కనుంటే చాలు నాకు ఉడకపోతలే
ఇస్సునంతా రమ్మంటే
నా ఇంటి దానివంటడే
ఆకురాయి సుపులోడే జాజిమొగులాలి
అందమంతా మెరుగు బెట్టే జాజిమొగులాలి
వాడు చూసే చూపులకు జాజిమొగులాలి
కన్నెతనమే కరిగిపాయె జాజిమొగులాలి
ఏ అర్ధరాత్రి యాదికొస్తే నిద్దరుండేదే
వాడు ముద్దు మీద ముద్దు పెడితే
పొద్దు పొడువదే
అమ్మ తోడు పాడు మనసు ఆగనంటదే
నాకు వాని మీద పానమంతా గుంజుతుంటదే
రాక రాక వచ్చినాడు మొన్న రాతిరే
నా రామసక్కనైన బావ సాటి ఎవ్వరే
కోరి కోరి పెట్టినాడు కొత్త కిరికిరే
వాడు అదుముకుంటే ఆడనంది ఉన్న ఊపిరే
నా తోడే వాడుంటే ఇగ మస్తు మస్తుగుంటదే
గుడెపోలే పిలగాడే జాజిమొగులాలి
గుండె కొల్లగొట్టినాడే జాజిమొగులాలి
కన్ను కన్ను కలిపినంటే జాజిమొగులాలి
ఎన్నులోన వణుకు బుట్టె జాజిమొగులాలి
దొరసాని నువ్వులు చూడే జాజిమొగులాలి
పున్నమోలే పోసినాయే జాజిమొగులాలి
తీగ నడుము చూడ బోతే జాజిమొగులాలి
నాగుపాము లెక్క ఊగే జాజిమొగులాలి.. ..
Jajimogulali Credits:
Movie: Rudrangi
Song: Jajimogulali
Lyrics: Abhinaya Srinivas
Singer: Mohana Bhogaraju
Music: Nawfal Raja Ais
Music Label: Lahari Music
Jajimogulali Lyrics In Telugu – జాజిమొగులాలి లిరిక్స్ – Rudrangi – 2023