ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
ఎపుడు నువు తలెత్తుకో
నిను మించిన తోపెవడిక్కడ
వడిగా కలబడిపో
భయపడితే బతకవు ఎక్కడ
తిడితే నువు పడొద్దురోయ్
తేల్చేసెయ్ ఎక్కడికక్కడ
కొడితే ఎదురెలిపో
దీని తస్సాదియ్యా
నే చెప్పిన లక్షణాలు
చూపించవు పుస్తకాలు
నా వెంబడి నేరుగా… వస్తే చూపిస్తా
నేనొకడికి లొంగడాలు
ఓ పడిపడి మొక్కడాలు
నా ఒంటికి పడదుగా
తమాషాలొద్దు నాతో
జగడాలే రాని రాని చూసుకుందాం
చావోరేవో తేలిపోద్దిలే
కెరటాల తోటి పోటి దేనికంట
లెక్క పత్రం రాసుకోదులే
ఎపుడు నువు తలెత్తుకో
నిను మించిన తోపెవడిక్కడ
వడిగా కలబడిపో
భయపడితే బతకవు ఎక్కడ
తిడితే నువు పడొద్దురోయ్
తేల్చేసెయ్ ఎక్కడికక్కడ
కొడితే ఎదురెలిపో
ఎవడైతే ఏంటి కాతర
లోకమెపుడు అరె బ్రదరు
డేగ కళ్ళతో చూస్తు ఉంటది, వదులదురా
నువు అవ్వకు కోడి… మిగలదు బాడీ
అన్ని వేళల శాంతి మంత్రము
వల్లెవేయకు కట్టేస్తారు పాడి
ఆ సంగతి తెలుసు నాకు
కాబట్టే పొగరు నాకు
ఆ మాత్రం ఉండడం తప్పేం కాదంటా
మైండ్ ఉన్నోడెవ్వడైన
నాలాగే బతుకుతాడు
నే చెప్పే మాటకే
చెయ్యెత్తి మొక్కుతాడు
ఎపుడు నువు తలెత్తుకో
నిను మించిన తోపెవడిక్కడ
వడిగా కలబడిపో
భయపడితే బతకవు ఎక్కడ
తిడితే నువు పడొద్దురోయ్
తేల్చేసెయ్ ఎక్కడికక్కడ
కొడితే ఎదురెలిపో
దీని తస్సాదియ్యా
జగడాలే రాని రాని చూసుకుందాం
చావోరేవో తేలిపోద్దిలే
కెరటాల తోటి పోటి దేనికంట
లెక్క పత్రం రాసుకోదులే ||2||