ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Jaali Jaali Sande Gaali Lyrics in Telugu – Yuddha Bhoomi
జాలి జాలి సంద్య గాలి లాలి పాడినా
తేలి తేలి మల్లె పూలు తెమ్మెరాడినా
ఎందుకో నిదురపోదు నా వయసూ
భహుశా…భహుశా ప్రేమించిందో ఏమో నా మనసూ
సోలి సోలి లేత ఈడు సొమ్మసిల్లినా
చూసి చూసి రెండు కల్లు చెమ్మగిల్లినా
ఎందుకో నిలువనీదు నా మనసూ
భహుశా…భహుశా విరహంలో ఉందేమో ఆ సొగసూ
పదమటింత పొద్దు వాలి గడియ పెట్టినా
పారతల్లి ఆకసాన దీపమెట్టినా
వాగులమ్మ అలలమీద వీణ మీటినా
వెన్నెలమ్మ కనుల మీద వేణువూదినా
ఆగదు అందదు మనసు ఎందుకో
ఒడినే అడిగే ఒంటి మీద వలపు సోకి
కంటి మీద కునుకు రాని కొంటె కోరికా తెలుసుకో
జాలి జాలి సంద్య గాలి లాలి పాడినా
చూసి చూసి రెండు కల్లు చెమ్మగిల్లినా
కోకిలమ్మ కొత్త పాట కూసుకొచ్చినా
పువ్వులమ్మ కొత్త హాయి పూసివెళ్ళినా
వాన మబ్బు మెరుపులెన్ని మోసుకొచ్చినా
మాఘవేల మత్తుజల్లి మంత్రమేసినా
తీరనీ తియ్యని మనసు ఏమిటో
అడుగు చెబుతా ఒంటిగుంటె ఓపలేక జంతకట్టుకున్నవేల
చిలిపి కోరికా తెలుపుకో ఇకా
సోలి సోలి లేత ఈడు సొమ్మసిల్లినా
చూసి చూసి రెండు కల్లు చెమ్మగిల్లినా
ఎందుకో నిలువనీదు నా మనసూ
భహుశా…భహుశా విరహంలో ఉందేమో ఆ సొగసూ
జాలి జాలి సంద్య గాలి లాలి పాడినా
తేలి తేలి మల్లె పూలు తెమ్మెరాడినా
ఎందుకో నిదురపోదు నా వయసూ
భహుశా…భహుశా ప్రేమించిందో ఏమో నా మనసూ