ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Ivali Ivvalyna Meeru Song Lyrics In Telugu – Taraka Ramudu
అమ్మాయి గారు అమ్మాయి గారు
ఒట్టేసి సెప్పండమ్మాయి గారు..!
ఏంటది..?
అందర్లా చూడరుగా నన్ను మీరు..!!
అంటే..?
ఆ ఏదేదో నాకు తోసింది మంచో చెడో చేసేస్తు ఉంటా కదా, ఐతే
అయినా నా మీద ఎప్పుడైన కోపం వస్తుందా మీకు..?
ఉహు రాదులే..!
అంటే, అంటే… నేనంటే, నువ్వంటే
మీకెంతో, నాకెంతో… ఇష్టమన్నమాట, హహ హా హా
ఇవ్వాలి ఇవ్వాళైనా మీరు… ఏది అది అమ్మాయి గారు
చెప్పాలి ఏం కావాలో మీరు… ఏదో అది అబ్బాయి గారు
నన్నే మెచ్చారు… నేనే నచ్చానన్నారు
తీరా అది ఇమ్మంటే… ఇంకా ఏమో ఆలోచిస్తారూ
చాల్లే నీ తీరు… విన్నాళ్ళేమనుకుంటారు
అయినా అడిగేదానికి… ఉందా లేదా ఏదో ఓ పేరు
ఆ మాట నా నోట… ఈ పూట వినిపించనా
ఐ వాంట్ ఎ కిస్ ఫ్రమ్ యూ
ఇవ్వాలి ఇవ్వాళైనా మీరు
ఏది అది అమ్మాయి గారు
ఎదురయ్యారా ఇష్టం అయిన వాళ్ళు
అది కావాలంటారంటగా
ఎద గూటిలో చోటిచ్చాగా నీకు
రుజువింకా చూపాలంటావా
ఏమోగాని అది ఎక్కడుంది మీరేం అనుకోనంటే
నేనే వెళ్లి తెచ్చుకొందునా
ఓహో వాటం మహా జోరుగుంది
పోనీ పాపం అంటే నీ మొహమాటం రెచ్చిపోయినా
అంటే కాదన్నట్టా అవునన్నట్టా తేల్చకుండా
అట్టా నవ్వుతుంటే ఎట్టాగమ్మా… హ హ్హ హ్హ హ్హ
ఇవ్వాలి ఇవ్వాళైనా మీరు
ఏది అది అమ్మాయి గారు
పసిపాపలా పంతం పట్టావంటే… కొరికేస్తా రెండు బుగ్గలు
అలవాటుగా ఒప్పో తప్పో అంటే… కొడతారా చెంప దెబ్బలు
అబ్బా అదేం కాదు వెర్రి నాయనా
ఏమి అర్థం కాదేమయ్యా… నీకు ఎట్టా చెప్పినా
ఇచ్చేదేదో ఇస్తే సంతోషించనా
ఉత్తి మాటల్తోనే ఊరిస్తుంటే ఊరుకుందునా
అంత బాహాటంగా అడిగేస్తావేం బండ రామయ్య
ఇది కాయా పండా నువ్వే చెప్పయ్యా
నాకేం తెలుసండి..?
ఇవ్వాలి ఇవ్వాళైనా మీరు… ఏది అది అమ్మాయి గారు
చెప్పాలి ఏం కావాలో మీరు… ఏదో అది అబ్బాయి గారు
నన్నే మెచ్చారు… నేనే నచ్చానన్నారు
తీరా అది ఇమ్మంటే… ఇంకా ఏమో ఆలోచిస్తరేంటండి
చాల్లే నీ తీరు… విన్నాళ్ళేమనుకుంటారు
అయినా అడిగేదానికి… ఉందా లేదా ఏదో ఓ పేరు
ఆ మాట నా నోట… ఈ పూట వినిపించనా, ఏవండీ
ఐ వాంట్ ఎ కిస్ ఫ్రమ్ యూ
తన్నాన తాననన నాన నన తన తన తన్నన్న నాన
తన్నాన తాననన నాన తన తన తన్నన్న నాన