Menu Close

Ippatikippudu Reppallo Song Lyrics In Telugu – Premaku Velayera

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Ippatikippudu Reppallo Song Lyrics In Telugu – Premaku Velayera

ఇప్పటికిప్పుడు రెప్పల్లో… ఎన్నెన్ని కలల ఉప్పెన్లో
ఉక్కిరి బిక్కిరి ఊహల్లో… ఎన్నెన్ని కలల ఊవిళ్లో
మనసుని మేలుకొమ్మని… కదిపి కుదిపే సరదాల సందడి, హ్మ్ హ్మ్
ప్రేమకి వేళయిందని… తరిమి తడిమే తరుణాల తాకిడి, హ్మ్ హ్మ్

ఏం చెయ్యమంది కొంటె అల్లరి… ఆ మాట చెప్పదు ఎల్లా మరి
మాటలేవి వద్దు చేరుకోమని… ఈ ఈ
చినికి చినికి ఉలికిపడే… చిలిపి వలపు చినుకు సడి
ఇప్పటికిప్పుడు రెప్పల్లో… ఎన్నెన్ని కలల ఉప్పెన్లో
ఉక్కిరి బిక్కిరి ఊహల్లో… ఎన్నెన్ని కలల ఊవిళ్లో, ఓ ఓ ఓఓ

సరసకు చేరలేదు ఇన్నాళ్ళు… జుంజుంజుంజుం
అలజడి రేపుతున్న తొందరలు… జుంజుంజుంజుం
పరిచయమైన లేదు ఏనాడు… జుంజుంజుంజుం
శిరసును వంచమన్న బిడియాలు… జుంజుంజుంజుం

సరదాగా మొదలైన శృతి మించే ఆటలో
నను నేనే మరిచానా మురిపించే ముద్దులో
ఏమైనా ఈ మాయ బాగుందిగా… ఆకాశ మార్గాన సాగిందిగా
ముడిపడి వీడనంది నూరేళ్ళ సంకెల
ఇప్పటికిప్పుడు రెప్పల్లో… ఎన్నెన్ని కలల ఉప్పెన్లో
ఉక్కిరి బిక్కిరి ఊహల్లో… ఎన్నెన్ని కలల ఊవిళ్లో, ఓ ఓహో ఓహో ఓ

కనపడలేదు మునుపు ఏనాడు… జుంజుంజుంజుం
కనులకు ఇన్ని వేల వర్ణాలు… జుంజుంజుంజుం
తెలియనే లేదు నాకు ఏనాడు… జుంజుంజుంజుం
తలపును గిల్లుతున్న వైనాలు… జుంజుంజుంజుం

పెదవుల్లో విరబూసే… చిరు నవ్వుల కాంతిలో
ప్రతి చోట చూస్తున్నా… ఎన్నెన్ని వింతలో
తొలిసారి తెలవారి నీ ఈడుకి
గిలిగింత కలిగింది ఈ నాటికి
జతపడి సాగమంది కౌగిళ్ళ వాడకి

ఇప్పటికిప్పుడు రెప్పల్లో… ఎన్నెన్ని కలల ఉప్పెన్లో
ఉక్కిరి బిక్కిరి ఊహల్లో… ఎన్నెన్ని కలల ఊవిళ్లో
మనసుని మేలుకొమ్మని… కదిపి కుదిపే సరదాల సందడి, హ్మ్ హ్మ్
ప్రేమకి వేళయిందని… తరిమి తడిమే తరుణాల తాకిడి, హ్మ్ హ్మ్

ఏం చెయ్యమంది కొంటె అల్లరి… ఆ మాట చెప్పదు ఎల్లా మరి
మాటలేవి వద్దు చేరుకోమని… ఈ ఈ
చిలికి చిలికి ఉలికిపడే చిలిపి వలపు చినుకు సడి
ఇప్పటికిప్పుడు రెప్పల్లో… ఎన్నెన్ని కలల ఉప్పెన్లో
ఉక్కిరి బిక్కిరి ఊహల్లో… ఎన్నెన్ని కళల ఊవిళ్లో

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading