Menu Close

తల్లి తండ్రులు కోసం ఈ పోస్ట్ – Interesting Short Stories in Telugu – Good Parenting

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Don’t Do These Parenting Mistakes.

ఉద్యోగానికి వెళ్లి ఇంటికి వచ్చిన తన తల్లిదండ్రులను ఓ చిన్నారి ఇలా ప్రశ్నించింది.

Parenting Tips in Telugu

చిన్నారి: అమ్మా! నాన్నా! మన ఇంటి బీరువా తాళాలు మన ఆయాకు ఎందుకు ఇచ్చి వెళ్లరు?
తల్లిదండ్రులు: అలాంటివన్నీ ఆయాకి ఇవ్వకూడదు.

చిన్నారి: మన బీరువాలోని నగలు డబ్బు ఆయాకు ఎందుకు ఇవ్వరో అదైనా చెప్పండి?
తల్లిదండ్రులు: నగలు డబ్బు ఎవరైనా ఆయాకు ఇచ్చి వెలతారా ఎంటమ్మా?

చిన్నారి: మీ ఎటియం కార్డ్ ఎందుకమ్మా ఆయాకు ఇచ్చి వెళ్లడం లేదో చెప్పండి?
తల్లిదండ్రులు: నీకేదో అయ్యింది ఏంటి నీ పిచ్చి ప్రశ్నలు అలాంటి ఖరీదైనవి, విలువైనవి ఆయాలకి ఇవ్వకూడదు.

చిన్నారి : అలా అయితే నన్ను మాత్రము ఆయా దగ్గర వదిలేసి వెళ్తునారెందుకు?
నెను మీకు ముఖ్యమైన దాన్ని కాదా అమ్మ?

ఈ సారి ఆ తల్లిదండ్రుల నుండి జవాబు రాలేదు.
కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి వారికి,
పసి మనసులు గాయపడి అడిగే ప్రశ్నలకు సమాదానం లేదు.

నేటి జీవన విధానం ఇది.
మారుతున్న ఈ కాలంలో,
డబ్బు మోజులో పడి తిండిని మానేస్తున్నాము,
డబ్బు మోజులో పడి ఆరోగ్యాన్ని వదిలేస్తున్నాము,
డబ్బు మోజులో పడి మానవత్వాన్ని వదిలేస్తున్నాము,
డబ్బు మోజులో పడి సంస్కారాన్ని వదిలేస్తున్నాము,
డబ్బు మోజులో పడి చివరికి
మానవ సంబందాల్ని కూడ పక్కన పెడుతున్నాము.

ఇన్ని వదిలేసి సంపాదించే డబ్బులో ఎముందో బ్రతకడం కోసం డబ్బు కావాలి కానీ ఇక్కడ డబ్బు కోసం బ్రతుకుతున్నాము.

ఈ పోస్ట్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా లైక్ చేసి షేర్ చెయ్యండి.

Like and Share
+1
1
+1
0
+1
0

Subscribe for latest updates

Loading