ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
రాత్రి పడుకునే ముందు మా పెరట్లో ఆ చీకట్లో కొంత మంది సంచరిస్తూ కనబడ్డారు. దొంగలేమో అని అనుమానం వచ్చి పోలీసులకు ఫోన్ చేసాను భయంతో. పోలీస్ స్టేషన్ నుండి, “ప్రస్తుతం స్టేషన్లో పోలీసులు ఎవ్వరూ లేరు, ఎవరైనా వస్తే పంపిస్తాం.” అంటూ పెట్టేసారు.
ఒక్క నిమిషం తరవాత నేను మళ్లీ ఫోన్ చేసి, “హలో !!! ఒక నిమిషం ముందు మా పెరట్లో దొంగల వంటి వాళ్ళు తిరుగుతున్నారని ఫోన్ చేసాను. ఇప్పుడు ఫరవాలేదు లేండి . నేనే నా తుపాకీతో వాళ్ళను కాల్చి పారేసాను.” నిముషాల్లో అర డజను పోలీసు వ్యాన్లు, బిలబిలమంటూ తుపాకులతో పోలీసులు దిగారు ఇంటిముందు. రెడ్ హ్యాండెడ్ గా దొంగలను పట్టుకున్నారు.
అందులో ఒక పోలీసు అధికారి, “మీ గన్ తో దొంగలను కాల్చామన్నారు.” అడిగాడు. దానికి నేను, ” మీ పోలీసు స్టేషన్లో పోలీసులు ఎవ్వరూ
లేరన్నారు.” అన్నాను ఆశ్చర్యం నటిస్తూ !!
సేకరణ – V V S Prasad