అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
తెలివైన కథ – Intelligent Stories in Telugu – Telugu Stories
మరో అద్బుతమైన కథతో ఈ రోజు నేను మీ ముంధుకు వచ్చాను.
చిన్న కథ, చాలా బాగుంటుంది. తప్పకుండా పూర్తిగా వినండి.
నచ్చితే లైక్ చెయ్యండి. ఇలాంటి మరిన్ని కథలు మీ ముందుకు
తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాము..
ఇక కథలోకి వెళ్తే ..
ఓ మహా నగరంలోనే పెద్ద ధనవంతుడు తన ఇంటికి కొన్ని మార్పులు మరియు మరమత్తులు చేయించుకుంటున్నాడు.
ఆ ఇంటి అండర్ గ్రౌండ్ పార్కింగ్ ని ఓ కార్పెంటర్ రూమ్ లా మార్చి, పార్కింగ్ ని వేరే పక్కన నిర్మించుకుంటున్నాడు.
ఆ అండర్ గ్రౌండ్ లో ఆల్రెడీ ఓ పాత కారు పార్క్ చేసి వుంది.
దాదాపుగా ఆ ఇంటి పని అంతా పూర్తి అయిపోయింది. ఇక కారుని అండర్ గ్రౌండ్ నుండి తీసి న్యూ పార్కింగ్ ప్లేస్ లో పెట్టాలి, బయటకు తీసే సమయంలో కారు టాప్
ఆ ఎంట్రన్స్ టాప్ కి తగులుతుంది… సుమారు ఒక అంగుళం మేర తగ్గితే తప్ప కారు బయటకు రాని పరిస్థితి.
అక్కడ ఆ ఇంటి ఓనర్, సివిల్ ఇంజనీర్, కాంట్రాక్ట్ కి తీసుకున్న వ్యక్తి ఇంకా వర్క్ చేస్తున్న వాళ్ళంతా వున్నారు.. ఎవరికీ కారు డ్యామేజ్ కాకుండా కారు తీసే ఆలోచన రాలేదు. అందరూ ఆలోచిస్తూ అటూ ఇటూ తిరుగుతూ ఉండగా… ఇదంతా పక్కన నిలబడి చూస్తున్న వాచ్ మెన్ వచ్చి..
సార్ నాదోక ఐడియా.. ఏమీ అనుకోనంటే చెబుతాను అని.. నాలుగు టైర్లలోనుంచి కొంచం గాలిని తీసేసి ప్రయత్నించండి అని చెబుతాడు…
ఈ ఐడియా రానందుకు వారు ఫీలవుతూ వాచ్ మెన్ చెప్పిన ప్రకారం చేసి కారును బయటకు తీసుకురావడం జరుగుతుంది.
ఈ సమాజంలో చాలా మంది గొప్ప గొప్ప స్తాయిలలో వున్నవాళ్ళు వున్నారు.
వారు వున్న ఫీల్డ్ ను బట్టి వారు గొప్ప ప్రతిభను కనబరుస్తారు.
కానీ, మనకు తెలియని పనిని మనం చేస్తున్నప్పుడు అందరి దగ్గర నుండి సలహాలు సూచనలు తీసుకోవడం ఉత్తమం.
ఎందుకంటే.. “సరైన సమయానికి సరైన ఆలోచన రావడం కష్టం” అదే తెలివి తేటలకి నిదర్శనం.
అది చాలా అనుభవం నుండి మాత్రమే కలుగుతుంది.
ఎవరి అనుభవం ఎంతో ఎవ్వరికీ తెలియదు కదా.. ..
ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చెయ్యండి.
ఈ వీడియొ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చెయ్యండి.
ఇలాంటి కంటెంట్ కోసం మా చానెల్ ని సబ్ స్క్రయిబ్ చేసుకోండి.