ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
ఒక పెద్ద మెరైన్ షిప్ ఇంజన్ ఫెయిల్ అయింది. ఇంజన్ ను చాలా మంది ఇంజనీరింగ్ నిపుణులు పరిశీలించి పెదవి విరిచారు. షిప్ ఫోర్మన్ ఒక ముసలి స్థానిక మెకానిక్ ను ఓనర్లకు పరిచయం చేశాడు. షిప్ ఓనర్లు విధి లేక ఒప్పుకొన్నారు. తన పనిముట్లతో షిప్ లోకి దిగి పనిలో మునిగి పోయాడు. ఎందరో నిపుణులు చేయలేని పనిని ఈ ముసలి మెకానిక్ ఏం చేస్తాడని అనుకుంటూ అందరూ షిప్ లోకి దిగి అతని పనితనం గమనించసాగారు.
మెకానిక్ షిప్ ఇంజన్ ను చాలా సేపు సునిశితంగా పరిశీలించి ఓ చిన్న సుత్తితో ఇంజన్ మీద ఒక చిన్న దెబ్బ కొట్టాడు. ఇంజన్ ఆశ్చర్యంగా, స్టార్ట్ అయింది. మెకానిక్ ₹10,000/- లకు బిల్ పంపాడు. చిన్న దెబ్బ కొట్టినందుకు పదివేలా ! ఓనర్లు ఇప్పుడు నిజంగానే ఆశ్చర్యపోయి, బిల్లు స్పష్టంగా ఇవ్వమని కోరారు.
(1) సుత్తితో కొట్టినందుకు ₹ 20/-
(2) ఎక్కడ కొట్టాలో తెలిసినందుకు ₹9980/-
అని పంపాడు బిల్.
మీరు నేర్చుకునే నైపుణ్యాలతో పాటు సృజనాత్మకత,
సమయస్ఫూర్తి మీ అభివృద్ధికి అంతే ముఖ్యం.
సేకరణ – VVS Prasad